సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం
*ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి*
*మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు*
సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. శ్రీశైలం ఆర్య సత్రం చైర్మన్ గా వ్యవహరించారని, అనేక సేవా కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు. ఆర్యవైశ్యులలో రాజకీయ చైతన్యం కావాలి అని, మార్పు కోరుకునే వారందరూ కూడా శ్యామ్ సుందర్ కు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా మహదేవ్, కక్కిరేణి చంద్రశేఖర్, బ్రాహ్మండ్లపల్లి మురళిధర్, బొమ్మిడి లక్ష్మి నారాయణ, సింగిరికొండ రవీందర్, గొండ్రాల అశోక్, కర్నాటి రవి లు పాల్గొన్నారు. సూర్యాపేట ఆర్యవైశ్య నాయకులు కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, చల్లా లక్ష్మయ్య, యామా సంతోష్, మంచాల శ్రీనివాస్, బెలిదె శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, మిర్యాల వెంకటేశ్వర్లు, వా సా లక్ష్మి నారాయణ,

Comments
Post a Comment