"హీరో"అవార్డు ఓ అద్భుతం..అతిశయం


 "హీరో"అవార్డు  ఓ అద్భుతం..అతిశయం


నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత.

మాచన రఘునందన్ మాతృమూర్తి "విజయ" ప్రత్యేక ఇంటర్వ్యూ 



"అమ్మా..! డిల్లీ నుంచి ఓ పార్సెల్ వస్తుంది.తీసుకో..మళ్లీ అది వాపస్ పోతే రావడం కష్టం.

అని మా అబ్బాయి చెప్తే..

ఏదో.. కవర్,చిన్న పార్సిల్ వస్తుందేమో అనుకున్నా..కాని 

ఓ నగల పెట్టే లా..బరువు ఉన్న బాక్స్ వస్తుంది అని అనుకోలేదు.


అత్యంత భద్రంగా.. ఏదో విలువైనది ఇందులో ఉన్నది అనుకునేలా.. బందబస్త్ పార్సెల్ వచ్చింది.

"రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తరం అందుకోవడం అంత సామాన్య విషయమా?!"

నా..బిడ్డ దేశం కోసం ఆలోచించడం.దేశం కోసం ఏదైనా మేలు చేయాలి అని క్షణ క్షణం ఆలోచిస్తేనే కదా..అసాధారణ విజయం సొంతం అయ్యేది.

అని..

తన తనయుడు చేసిన 

అలుపెరుగని కృషి గురించి ఎంతో ఆర్ద్రంగా వివరించారు మాచన విజయ.

ఇన్నాళ్ళకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో 

అద్భుత ఫలితం రావడం మాకు పద్మ పురస్కారమే అన్నారు "మాచన" మాతృమూర్తి.

మరిన్ని వివరాలు..ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో..

మాచన విజయ మాటల్లోనే..


"ఎంత సంపాదించాము. ఎంత కూడబెట్టుకున్నాం అని ఆలోచించే కొందరి కి భిన్నంగా మా వాడు(మాచన రఘునందన్) దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలను, ఎందరో వ్యక్తులను ఓ వ్యక్తి ఇలా..చేయగలగడం సాధ్యమేనా.?! అని ఆశ్చర్య పోయేలాచేసింది". రఘునందన్ కు అవార్డు ఇవ్వక పోతే.. "ఓ రణధీరుణ్ణి నిరుత్సాహపరచడమే" అని భావించి

"రఘునందన్..యాన్ అమేజింగ్ అండ్ ఎక్ట్రార్డినరీ" "లెట్.. హిమ్ గెట్ దిస్ అవార్డ్" అని ఎంపిక కమిటీ సభ్యులను ఆలోచింపజేసిందటే అంత ఆషా మాషి కాదు.హీరో అవార్డు ను ఓ నగల పెట్టే లో పెట్టినట్టు పెట్టి భద్రంగా మా ఇంటికి పంపారు.

దీనికి మించి ఓ కన్న తల్లి కి కావాల్సింది ఇంకేముంటుంది.


బిడ్డల ఉన్నతి,వారి ప్రతిభ కు దక్కిన ఫలితం,కృషి, పట్టుదల ల తాలుకు అసామాన్య విజయం కన్న వారికి అవధుల్లేని అమిత సంతోషాన్ని ఇస్తాయని మాచన విజయ అన్నారు.


పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా పని చేస్తూనే..జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ ను అనూహ్యంగా కైవసం చేసుకున్న మాచన రఘునందన్ మాతృమూర్తి "విజయ" హైదరాబాద్ లో పలు పాఠశాలల్లో టీచర్ గా పని చేసి,ఇపుడు తనయుడు రఘునందన్ సాధిస్తున్న విజయాల్ని కడుపారా ఆస్వాదిస్తున్న తృప్తి దక్కించుకున్నారు.


రఘునందన్ పొగాకు నియంత్రణ అనే గాక విద్యార్ధులు, యువత పొగాకు ఉత్పత్తుల కు బలి కాకుండా స్కూళ్లు కాలేజీల వద్ద సిగరెట్ ల విక్రయాలను నిషేధించాలి అంటూ..ఇటీవల రాష్ట్రపతి వరకు సైతం విషయాన్ని తీసుకెళ్ళారు.ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి , ఆయా రాష్ట్రాలకు స్కూళ్లు, కాలేజీల వద్ద సిగరెట్ బీడి గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాల ను నిషేధించండి అంటూ నిర్దేశాలు వెళ్లాయి.


ఈ ఆదేశాల వెనక మాచన రఘునందన్ అలుపెరుగని కృషి ఉంది.ముఖ్యం గా అమ్మ అండ ఉంది.అమ్మ అభయ హస్తం కూడా ఉంది.


అమ్మ త్యాగం చెప్పలే"నిధి"


నేను, డిగ్రీ లో ఉన్నపుడు అనుకునెవాణ్ణి, అమ్మ మన కోసం ఇంతగా కష్టపడుతోంది. అమ్మ కళ్ళలో ఏ రోజు ఐనా.. ఆ కష్టం మరచిపోయేలా ఓ గొప్ప విజయాన్ని కానుకగా ఇవ్వాలి అని 20 ఏళ్ల కిందటే మానసికంగా దృఢంగా తీర్మానించుకోవడం వల్లే..ఇపుడు ఈ అసామాన్య విజయం సాధించిన సంతోషం కలుగుతోంది.


అమ్మ ఓ ఐదారేళ్ళ పాటు అప్పుడు మేం ఉన్న న్యూ బాకారం బాలాజీ టాకీస్ ఏరియా నుంచి నడచుకుంటూ వెళ్లి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ స్కూల్ లో చెప్పి వచ్చేది.రోజూ 20 కిలో మీటర్ల దూరం నడచుకుంటూ.. వెళ్ళి రావడం..అదీ కేవలం ₹500 కోసం అంటే..ఇప్పటికీ నాకు ఒకింత బాధగా గా నే ఉంటుంది.

_మాచన రఘునందన్

Comments