Posts

Showing posts from October, 2026

*టీజీపీసీబీలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.. సర్దార్ పటేల్ కు నివాళి*

Image
 *టీజీపీసీబీలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.. సర్దార్ పటేల్ కు నివాళి* *హైదరాబాద్, అక్టోబర్ 31:* ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రధాన కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేస్తామని, ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోని పలు సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి దేశ ఐక్యతకు పటేల్ చేసిన అసమాన కృషిని అధికారులు స్మరించుకున్నారు. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, భాషలతో కూడిన భారతదేశాన్ని ఐక్యంగా నిలపడంలో ఆయన చారిత్రక పాత్రను కొనియాడారు. పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జాతీయ సమగ్రత, సోదరభావ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

రేణుక–చిరంజీవి వివాహం వైభవంగా.. రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు

Image
 రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి రేణుక వివాహం, చిరంజీవితో అత్యంత వైభవంగా జరిగింది. అమీర్‌పేట్‌లోని ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టరేట్’ ఈ ఘనమైన వేడుకకు వేదికైంది. సమాజంలో దిక్కులేని వారికి అండగా నిలవాలనే సంకల్పంతో రూపాయి ఫౌండేషన్ నిర్వాహకులు ఈ పెళ్లి బాధ్యతను భుజాన వేసుకున్నారు. నూతన వధూవరులకు అవసరమైన పుస్తె మట్టెలు, తాళి, మరియు పెళ్లి సామాగ్రిని ఫౌండేషన్ తరఫున ఉచితంగా అందజేశారు. వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులు, అతిథులందరికీ ఘనంగా భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ వివాహ వేడుకను రూపాయి ఫౌండేషన్ ప్రాజెక్టు చైర్మన్ జగిని శ్రీనివాస్ - అనిత దంపతులు, కో చైర్మన్ యడవెల్లి బాలరాజు - రమ దంపతులు, మరియు ఫౌండర్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ - అరుణ దంపతులు +91 92465 76070దగ్గరుండి నడిపించి విజయవంతం చేశారు. ఒక అనాథ బాలికకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేసిన రూపాయి ఫౌండేషన్ ప్రతినిధుల సేవా నిరతిని, మానవత్వాన్ని పలువురు ప్రముఖులు, స్థానికులు ప్రశంసించారు. నూతన వధూవరులు రేణుక - చిరంజీవి దంపతులు నూరేళ్లూ వర్ధిల్లాలని వా...

*రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు రూ.22 వేలు లంచం.. మంచిర్యాల జిల్లా గ్రామ పాలనాధికారి ఏసీబీ వలలో*

Image
 *రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు రూ.22 వేలు లంచం.. మంచిర్యాల జిల్లా గ్రామ పాలనాధికారి ఏసీబీ వలలో* *మంచిర్యాల, అక్టోబర్ 29:* రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు లంచం డిమాండ్ చేసిన గ్రామ పాలనాధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.166 ప్రకారం..* ఆదిలాబాద్ రేంజ్ అధికారులు బుధవారం మంచిర్యాల జిల్లా మోసం గ్రామ పాలనాధికారి డి. శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుడి తండ్రి పేరు రెవెన్యూ రికార్డుల్లో తప్పుగా నమోదు కావడంతో సవరణ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి పేరు సరిచేసి, వ్యవసాయ భూమి వారసత్వం ఫిర్యాదుదారుడు, అతని సోదరుడికి వచ్చేలా పై అధికారులకు నివేదిక పంపేందుకు గ్రామ పాలనాధికారి రూ.22 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ వల వేయగా తన కార్యాలయంలోనే రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. లంచం సొమ్మును నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారిక సహాయం చేసేందుకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. నిందితుడిని కరీంనగర్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉందని...

నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం: ఏకకాలంలో ఏసీబీ, డ్రగ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల మెరుపు దాడులు!

Image
 నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం: ఏకకాలంలో ఏసీబీ, డ్రగ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల మెరుపు దాడులు! హైదరాబాద్: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో గురువారం భారీ కలకలం రేగింది. ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై వచ్చిన ఫిర్యాదులతో పలు ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగాయి. నిమ్స్ చరిత్రలోనే అత్యంత అరుదుగా, ఒకేసారి ఏసీబీ (ACB), డ్రగ్ కంట్రోల్, మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపు తనిఖీలు చేపట్టడం వైద్య వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రికార్డులు జల్లెడ పడుతున్న ఏసీబీ అధికారులు ఆసుపత్రిలోని కొన్ని విభాగాల్లో నిధుల దుర్వినియోగం, టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సుమారు పది మంది ఏసీబీ (ACB) అధికారులు రంగంలోకి దిగారు. ఆసుపత్రిలోని పరిపాలనా విభాగంతో పాటు కీలక కార్యాలయాల్లోని రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొందరు అధికారుల గత నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. సర్జికల్ స్టోర్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సోదాలు మరోవైపు, ఆసుపత్రిలోని ప్రధాన...

*తుఫానుతో కోదాడ నియోజకవర్గంలో వరి పంటకు నష్టం.. రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు బీజేపీ నేత వినతి*

Image
 *తుఫానుతో కోదాడ నియోజకవర్గంలో వరి పంటకు నష్టం.. రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు బీజేపీ నేత వినతి* *సూర్యాపేట:* అక్టోబర్ 27, 28 తేదీల్లో వచ్చిన తుఫాను వల్ల కోదాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలపాలైందని, రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆయన వినతి సమర్పించారు. తుఫాను వల్ల వరి పంట తడిసి గాలికి ఒరిగి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కోత దశలో ఉన్న వందలాది ఎకరాల వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమగ్ర నివేదిక తెప్పించుకుని, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద పంట నష్టపరిహారం రైతులకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

*అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షలు.. రూ.లక్షకు బేరం కుదుర్చుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ ఏసీబీ వలలో*

Image
 *అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షలు.. రూ.లక్షకు బేరం కుదుర్చుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ ఏసీబీ వలలో* *హైదరాబాద్, అక్టోబర్ 28:* కోర్టు కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏసీబీ కేసులో చిక్కుకున్నాడు. *ఏసీబీ ప్రెస్ నోట్  ప్రకారం..* బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ కొట్టూర్ విజయ్ పై క్రిమినల్ మిస్ కండక్ట్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కోర్టు రిఫరల్ ద్వారా నమోదైన క్రైమ్ నెం. 524/2024, 525/2024 కేసుల్లో ఫిర్యాదుదారుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఎస్ఐ మొదట రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత అది రూ.లక్షకు కుదిరింది. అరెస్ట్ చేయకుండా 41-A Cr.P.C. కింద నోటీసులు ఇచ్చి, ఫిర్యాదుదారుడు ఇచ్చే సమాధానాలు స్వీకరించి, ఈ వ్యవహారంలో కొత్త కేసులు నమోదు కాకుండా చూస్తానని హామీ ఇచ్చి లంచం కోసం ఒత్తిడి చేశాడు. అక్రమ లబ్ధి కోసం తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ గుర్తించింది. నిందితుడైన ఎస్ఐని నాంపల్లిలోని 1వ అదనపు ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు. క...

*పెట్రోల్ బంక్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్, ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ వలలో*

Image
 *పెట్రోల్ బంక్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్, ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ వలలో* *యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28:* పెట్రోల్ బంక్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇచ్చినందుకు లంచం డిమాండ్ చేసిన లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు మంగళవారం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏసీబీ అధికారులు వెల్లడించిన సమాచారం  ప్రకారం..* యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, అతని అనుచరుడు కసారం రవీందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ఈ కేసులో నిందితులు. రవీందర్ పెట్రోల్ పంప్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఫిర్యాదుదారుడికి చెందిన పెట్రోల్ బంక్ కు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేసి, డైలీ సేల్స్ రిజిస్టర్ అప్పగించినందుకు బహుమానంగా ఇన్ స్పెక్టర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. తనకు బదులుగా ప్రైవేట్ వ్యక్తి రవీందర్ ద్వారా లంచం తీసుకోవాలని ప్లాన్ వేశాడు. ఇన్ స్పెక్టర్ సూచనల మేరకు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రవీందర్ రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందులో రూ.15 వేల...

*కేసు క్లోజ్ చేయాలంటే రూ.6 లక్షలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మిర్చౌక్ ఇన్ స్పెక్టర్, హోంగార్డు*

Image
 *కేసు క్లోజ్ చేయాలంటే రూ.6 లక్షలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మిర్చౌక్ ఇన్ స్పెక్టర్, హోంగార్డు* *హైదరాబాద్, అక్టోబర్ 27:* కేసు మాఫీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన మిర్చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్, హోంగార్డు ఏసీబీ వలలో చిక్కారు. * మిర్చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎం. కొండల్ రావు, అదే స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆబిద్ అలీని సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైన కేసును క్లోజ్ చేయడానికి, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో సహకరిస్తామని చెప్పి ఇన్ స్పెక్టర్ రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా రూ.3 లక్షలను హోంగార్డు ఆబిద్ అలీ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. లంచం సొమ్ము రూ.3 లక్షలను హోంగార్డు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ లబ్ధి కోసం వ్యవహరించారని ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వ...

*ఆఫీసు నుంచి అక్రమంగా నగదు తరలిస్తూ.. జలమండలి జాయింట్ డైరెక్టర్ వద్ద రూ.2.40 లక్షలు పట్టుబడ్డాయి*

Image
 *ఆఫీసు నుంచి అక్రమంగా నగదు తరలిస్తూ.. జలమండలి జాయింట్ డైరెక్టర్ వద్ద రూ.2.40 లక్షలు పట్టుబడ్డాయి* *హైదరాబాద్, అక్టోబర్ 25:* ఆఫీసులో అక్రమంగా వసూలు చేసిన నగదును ఇంటికి తరలిస్తున్న హైదరాబాద్ జలమండలి జాయింట్ డైరెక్టర్ ఏసీబీకి దొరికిపోయాడు. ఏసీబీ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఖైరతాబాద్ లోని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బీ కార్యాలయంలో ఉన్నతాధికారి ఒకరు ఆఫీసు నుంచి అక్రమంగా నగదు వసూలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నాడన్న అజ్ఞాత సమాచారం సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులకు అందింది. దీంతో అధికారులు నిఘా పెట్టారు. అక్టోబర్ 24న రాత్రి 7 గంటల సమయంలో రాజ్ భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్ మెంట్ ఎదురుగా TS08 GQ 3699 నంబర్ గల మారుతి స్విఫ్ట్ కారును ఏసీబీ అధికారులు అడ్డగించారు. ఆ కారు జలమండలి జాయింట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ ది అని తేలింది. ఆకస్మిక తనిఖీలో కారులో ఏకంగా రూ.2 లక్షల 40 వేల లెక్కల్లో లేని నగదు పట్టుబడింది. ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా ఇంత నగదు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో ఆ నగదును అవినీతి కోణ...

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలింపునకు ఈటల పోరుబాట

Image
  జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలింపునకు ఈటల పోరుబాట 27 నుంచి బాధితులతో పాదయాత్ర.. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు రాజీపడేది లేదన్న మల్కాజిగిరి ఎంపీ హైదరాబాద్, అక్టోబర్ 25: జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తీవ్ర కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు రాజీపడే ప్రసక్తే లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. డంపింగ్‌యార్డును తరలించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 నుంచి బాధిత ప్రజలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో జవహర్‌నగర్ డంప్‌యార్డు కాలుష్య నియంత్రణ, సమస్యలకు శాశ్వత పరిష్కారంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పర్యావరణవేత్తలు దొంతి నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, దామోదర్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలత...

ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి - మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్

Image
  ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి -  మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్ హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచే దిశగా ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మెజారిటీ ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారని ఆర్యవైశ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్యవైశ్యుల సామాజిక, రాజకీయ అంశాలపై ఉప్పల శ్రీనివాస్ గుప్త చురుకుగా పనిచేస్తున్నారని ఆయనకు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఆర్యవైశ్యుల ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం వంటి అంశాలపై పలు సందర్భాల్లో మాట్లాడారు. ప్రత్యేకంగా ఆర్యవైశ్యులు వ్యాపార రంగానికే పరిమితం కాకుండా రాజకీయంగానూ ఎదగాలని ఆయన పలు కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించాలంటే ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని పలువురు ఆర్యవైశ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.  ఆర్యవైశ్య వర్గాల్లో వ్యక్తమవుతున్న డిమాండ్ 

నానక్‌రామ్‌గూడ, కోకాపేట నిర్మాణ ప్రాజెక్టులపై టీజీపీసీబీ కొరడా

Image
  నానక్‌రామ్‌గూడ, కోకాపేట నిర్మాణ ప్రాజెక్టులపై టీజీపీసీబీ కొరడా 19 ప్రాజెక్టులపై పర్యావరణ నిబంధనల అమలు సమీక్ష.. ఉల్లంఘనలకు పరిహారం, బ్యాంకు గ్యారంటీల జప్తుకు సిఫారసు హైదరాబాద్, అక్టోబర్ 24: నానక్‌రామ్‌గూడ, కోకాపేట ప్రాంతాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) చర్యలు చేపట్టింది. నిర్మాణ ప్రాజెక్టుల్లో పర్యావరణ నిబంధనలు, వాయు కాలుష్య నియంత్రణ చర్యల అమలును పరిశీలించేందుకు రోలింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో నానక్‌రామ్‌గూడ, కోకాపేట ప్రాంతాల్లోని 19 నిర్మాణ ప్రాజెక్టుల పర్యావరణ నిబంధనల అమలు స్థితిగతులను సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుల వారీగా నిబంధనల అమలుపై సమగ్రంగా చర్చించిన కమిటీ.. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించాలని, తక్కువ తీవ్రత కలిగిన ఉల్లంఘనల విషయంలో ప్రాజెక్టులు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను...

సరాకా లేబొరేటరీస్ పరిశ్రమలో క్లోరోఫామ్ లీకై ఇద్దరు మృతి చెందిన ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ* పరిశ్రమ మూసివేతకు టీజీపీసీబీ ఆదేశాలు*

Image
  *సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరాకా లేబొరేటరీస్ పరిశ్రమలో క్లోరోఫామ్ లీకై ఇద్దరు మృతి చెందిన ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ*  *పరిస్థితిని సమీక్షించి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన టిజిపిసిబి* సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన క్లోరోఫామ్ లీకేజీ ప్రమాద ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి చర్యలు చేపట్టింది.  ఈ ఘటన నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) అధికారులు పరిశ్రమను తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను పరిశ్రమ జనరల్ మేనేజర్ మధు, డిప్యూటీ జనరల్ మేనేజర్ యోగేశ్వర్ రావు ల తెలుసుకున్నారు. నిన్న (22 అక్టోబర్, 2026) రాత్రి సుమారు 11:30 గంటలకు క్లోరోఫామ్ లీకేజీ జరిగిందని, ఆవిరికి గురైన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని నారాయణ ఆసుపత్రికి తరలించగా, వైద్యుడు మృతి చెందినట్లు ప్రకటించారని వారు పిసిబి అధికారులకు వివరించారు. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్‌-2లో, మొదటి అంతస్తులో ఉ...

*కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఆపేస్తాం.. రూ.39 లక్షలు వసూలు చేసిన PMKSY అధికారులు ఇద్దరు అరెస్ట్*

Image
 *కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఆపేస్తాం.. రూ.39 లక్షలు వసూలు చేసిన PMKSY అధికారులు ఇద్దరు అరెస్ట్* *జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 22:* భగీరథీపేట్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ నుంచి బిల్లుల పేరుతో భారీగా కమీషన్ వసూలు చేస్తున్న ఇద్దరు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ ప్రెస్ నోట్ నెం.160 ప్రకారం నిందితులను ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజుగా గుర్తించారు. ఇద్దరూ PMKSY 2.0, భగీరథీపేట్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. PMKSY 2.0 పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు క్లియర్ చేయడానికి, అలాగే కొత్త పనులు కేటాయించడానికి ఈ ఇద్దరు అధికారులు 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పెండింగ్ బిల్లులు ప్రాసెస్ చేయబోమని, కొత్త పనులు ఇవ్వబోమని బెదిరింపులకు కూడా దిగారు. ఫిర్యాదు అందిన తర్వాత విచారణ చేపట్టిన ఏసీబీకి సంచలన విషయాలు తెలిశాయి. నిందితులు సూచించిన వివిధ బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఖాతాలకు కాంట్రాక్టర్ ఏకంగా రూ.39 లక్షల 17 వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్ మెంట్లు, వాట్సాప్ చాట్ రికార్డులను కూడా ఫిర్యాదుదారు...

ఓపెన్ కాస్ట్ బొగ్గు బొగ్గు గనిని నిలిపివేయాలి

Image
 ఓపెన్ కాస్ట్ బొగ్గు బొగ్గు గనిని నిలిపివేయాలి  👉 రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్ రావు  👉 మంత్రి సీతక్కకు వినతి  👉 రామప్ప పరిరక్షణ అందరి బాధ్యత 👉 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు 👉 ఈ ప్రాంత ప్రజలు ఆధర్య పడొద్దని సీతక్క హామీ  .............  వెంకటాపూర్ శివారులో ఏర్పాటు చేయనున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వల్ల ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లనుందని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్ రావు అన్నారు. బుధవారం తన పర్యటలో భాగంగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చేరుకున్న మంత్రి సీతక్కను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్ రావు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో భాగంగా జరిపే బ్లాస్టింగ్ ల వల్ల ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర గలిగిన రామప్ప దేవాలయ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని, శతాబ్దాల నాటి శిల్పాలతో పాటు గుడి కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప ఆలయం యునెస్కో ...

*తోటి ఉద్యోగి కుటుంబానికి టీఎన్జీఓఎస్ నల్గొండ జిల్లా సంఘం అండ ఆర్థిక సహాయం అందజేత*

Image
  *తోటి ఉద్యోగి కుటుంబానికి టీఎన్జీఓఎస్ నల్గొండ జిల్లా సంఘం అండ ఆర్థిక సహాయం అందజేత* నల్గొండ: చండూరు మండలం పుల్లెముల గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య  నిన్న సాయంత్రం మృతి చెందడం పట్ల నల్గొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు  నాగిళ్ల మురళి  జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అంజయ్య  పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తూ టీఎన్జీఓఎస్ నల్గొండ జిల్లా సంఘం తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉద్యోగుల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే సంఘం ప్రధాన లక్ష్యమని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా, నల్గొండ జిల్లా కలెక్టర్  బి. చంద్రశేఖర్ రావు  అదనపు కలెక్టర్  ప్రేమ్ కరణ్ రెడ్డి  మానవతా దృక్పథంతో స్పందించి, మృతుడు శ్రీపత...

*కీసర ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.2.28 కోట్ల అక్రమాస్తులు*

Image
 *కీసర ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.2.28 కోట్ల అక్రమాస్తులు*  *మేడ్చల్-మల్కాజిగిరి, అక్టోబర్ 17:* లంచం కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న కీసర ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులుకు ఏసీబీ మరో షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.159* ప్రకారం డీఏ కేసు నమోదు చేసింది. సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు అక్టోబర్ 17న ఇన్‌స్పెక్టర్ ఇల్లు, ఆఫీసుతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 6 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. *సోదాల్లో గుర్తించిన ఆస్తులు:* - సరూర్ నగర్ లింగోజిగూడలో రెండు ప్లాట్లు (150 చ.గజాలు చొప్పున) - రూ.30 లక్షలు - మన్సూరాబాద్ CR ఎన్‌క్లేవ్, ఎల్బీనగర్‌లో 240 గజాల ఇల్లు - రూ.40 లక్షలు - పేరూర్ గ్రామంలో 180 గజాలలో నిర్మాణంలో ఉన్న ఇల్లు - రూ.50 లక్షలు - హాలియా, మిర్యాలగూడలో 2 ఎకరాల వ్యవసాయ భూమి - రూ.80 లక్షలు వీటితో పాటు రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారం, రూ.6.50 లక్షల విటారా బ్రెజ్జా కారు, రూ.10 లక్షల గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే మొత్తం *రూ.2 కోట్ల 28 లక్షల 50 వేలు* విలువైన ఆస్తులుగా ఏసీబీ అంచనా వేసింది. మార్కె...

రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ TGSPDCL ఏఈ పట్టుబాటు

Image
  రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ TGSPDCL ఏఈ పట్టుబాటు హైదరాబాద్, అక్టోబర్ 15: విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన పనిని మంజూరు చేసేందుకు రూ.1.20 లక్షల లంచం తీసుకుంటున్న తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) అసిస్టెంట్ ఇంజినీర్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మదన్నపేట్ సెక్షన్, TGSPDCL ఆపరేషన్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పి.ఎస్. రాకేష్ ఒక ఫిర్యాదుదారుడికి ఆరు కొత్త విద్యుత్ మీటర్లను మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడి నుంచి రూ.1,20,000 లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ACB అధికారులు దాడి చేసి రాకేష్‌ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ACB అధికారులు లంచం సొమ్ముకు సంబంధించి రసాయన పరీక్షలు నిర్వహించి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి న్యాయపరమైన చర్యల కోసం ప్రత్యేక ACB కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత...

*ఆమంచి రాజాలింగము కు ఘన సన్మానం*

Image
  *ఆమంచి రాజాలింగము కు ఘన సన్మానం* *నల్గొండ:* ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నల్గొండ జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా ఎన్నికైన కుమ్మర ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (TRKS) రాష్ట్ర కోశాధికారి *ఆమంచి రాజాలింగము* ని మైసూర్ నగర్ కుమ్మరి శాలివాహన సంఘం కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, మొక్కను అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, సమాజ సేవలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైసూర్ నగర్ కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు కంభంపాటి మహేష్, ప్రధాన కార్యదర్శి ఊట్కూరి సాయి చరణ్, కోశాధికారి ఏరుకొండ హరి, గౌరవ సలహాదారులు సిరిసినవాడ శ్రీనివాస్, కార్యదర్శి ఓరుగంటి గోపాలకృష్ణ, కార్యనిర్వహకులు ఆరూరి శ్రీను, కట్కూరి శ్రీను, సభ్యులు బొడ్డుపల్లి అంజయ్య,యూత్ అధ్యక్షులు కంభంపాటి రాజు, ఉపాధ్యక్షులు ఊట్కూరి శ్రీను నాయకులు, కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.

*లేఔట్ సర్వేకు రూ.30 లక్షలు డిమాండ్.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్*

Image
 *లేఔట్ సర్వేకు రూ.30 లక్షలు డిమాండ్.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్* *రంగారెడ్డి, అక్టోబర్ 12:* రంగారెడ్డి జిల్లాలో భారీ లంచం వ్యవహారం బయటపడింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి చెందిన తహసీల్దార్, మండల సర్వేయర్ ఏకంగా రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.155 ప్రకారం..* *నిందితులు:* *AO-1: శ్రీ బతుకా శ్రీనివాసులు, మండల సర్వేయర్, అబ్దుల్లాపూర్ మెట్* *AO-2: శ్రీ బి. సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్, అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి జిల్లా* అక్టోబర్ 12, 2026 సాయంత్రం సీఐయూ ఏసీబీ అధికారులు ఈ దాడి చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామం, మండలం సమీపంలో AO-1 శ్రీనివాసులును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడి లేఔట్ కు సంబంధించి HMDA మార్గదర్శకాల ప్రకారం సర్వే నిర్వహించి, జాయింట్ ఇన్ స్పెక్షన్ సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. మొదట రూ.30 లక్షలు అడిగి, చివరకు రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి సూచనల మేరకు మండల సర్వేయర్ శ్రీనివాసులు ఫిర్...

*టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.12 వేలు లంచం.. ఏసీబీ వలలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్*

Image
 *టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.12 వేలు లంచం.. ఏసీబీ వలలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్* *నిర్మల్, అక్టోబర్ 08:* నిర్మల్ జిల్లాలో ఫారెస్ట్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.153 ప్రకారం..* *నిందితుడు: శ్రీ ఐంద్ల రవీందర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఖానాపూర్ రేంజ్ & డివిజన్, నిర్మల్ జిల్లా.* అక్టోబర్ 08, 2026న ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రవీందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడికి చెందిన టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం సైట్ ను విజిట్ చేసి, ఇన్ స్పెక్షన్ రిపోర్టును ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేయడానికి సెక్షన్ ఆఫీసర్ రూ.12,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ.12,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తన పదవిని దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందేందుకు అధికారి తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్ లోని గౌరవ SPE & ACB కేసుల స్పెషల్ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుల వ...

పీసీబీలో కుంటుపడిన పాలన! - కొత్త చైర్మన్ రాకతో నిలిచిపోయిన కార్యకలాపాలు?

Image
  పీసీబీలో కుంటుపడిన పాలన! -  కొత్త చైర్మన్ రాకతో నిలిచిపోయిన కార్యకలాపాలు? రెండు నెలలుగా ఫిర్యాదుపై చర్యలు శూన్యం.. నివేదిక అందినా అధికారుల మౌనం! అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలు.. టాస్క్‌ఫోర్స్ సమావేశం ఎప్పుడు? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB)లో పాలన పూర్తిగా కుంటుపడిందా? కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్‌ను నియమించినప్పటికీ, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? క్షేత్రస్థాయి తనిఖీలు పూర్తయి, సంబంధిత ప్రాంతీయ అధికారి (RO) నివేదిక సమర్పించినా చర్యలు లేకపోవడం వెనుక కారణాలేమిటి? కొత్త చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టాస్క్‌ఫోర్స్ సమావేశాలు నిర్వహించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన కీలక విభాగంలోనే ఫిర్యాదులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు నుంచి తన...

*వాయు కాలుష్యానికి చెక్.. తెలంగాణలో PM10 స్థాయిలు తగ్గుముఖం - నల్గొండలో 59 నుండి 71 వరకు పెరుగుదల - సెక్రటేరియట్ లో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమీక్ష

Image
 *వాయు కాలుష్యానికి చెక్.. తెలంగాణలో PM10 స్థాయిలు తగ్గుముఖం - నల్గొండలో 59 నుండి 71 వరకు పెరుగుదల - సెక్రటేరియట్ లో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమీక్ష* *హైదరాబాద్, అక్టోబర్ 07:* తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు సెక్రటేరియట్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిటీ ఛైర్మన్ *అహ్మద్ నదీమ్*, టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్ *రవి* ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ, ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్, వ్యవసాయ, పౌర సరఫరాల, పరిశ్రమల శాఖల అధికారులు పాల్గొన్నారు. *సమావేశంలో వెల్లడైన కీలక అంశాలు:* *PM10 స్థాయిల్లో తగ్గుదల:* 2019-20 నుంచి 2025-26 మధ్య హైదరాబాద్ లో PM10 సగటు 86 నుంచి 80 µg/m³కు, సంగారెడ్డిలో 87 నుంచి 78 µg/m³కు తగ్గింది. నల్గొండలో మాత్రం 59 నుంచి 71కు పెరిగింది. ప్రస్తుత AQI సంతృప్తికరం నుంచి మోస్తరు స్థాయిలో ఉంది. *పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం:* ...

*కోరుట్ల RTA ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ 7 అవకతవకలు*

 *కోరుట్ల RTA ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ 7 అవకతవకలు* *జగిత్యాల, అక్టోబర్ 06:* జగిత్యాల జిల్లా కోరుట్లలోని యూనిట్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 06, 2026న కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు కోరుట్ల RTA ఆఫీసులో సర్ ప్రైజ్ చెక్ చేశారు. ఆఫీసు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలానాలు, పెండింగ్ దరఖాస్తులు, మొత్తం కార్యాలయ పనితీరును పరిశీలించారు. *తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు:* *1.* MVI లేకుండానే ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ N. గిరీష్ కుమార్ డ్రైవింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తూ, వాహనాల రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నట్లు గుర్తించారు. *2.* అధికారిక పనుల కోసం ఏజెంట్ల ద్వారా ప్రజల నుండి అదనపు డబ్బు వసూలు చేస్తున్నారు. *3.* సామాన్య ప్రజలు చేసిన దరఖాస్తుల విషయంలో ఏజెంట్లకు ఆఫీసులోకి పూర్తి స్వేచ్ఛ ఉంది. పని పూర్తయ్యే వరకు RTA సిబ్బందితో వారే డీల్ చేస్తున్నారు. *4.* రికార్డులు, రిజిస్టర్లను సరిగా నిర్వహించడం లేదు. *5.* సబార్డినేట్ల పని మరియు కేటాయించిన విధులపై పర్యవేక్షణ లేదు. *6.* డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాల్సిన ప్రదేశం రవాణా శా...

*మెడికల్ బిల్లు కోసం రూ.25 వేలు లంచం.. ఫోన్ పే లో తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలలో*

Image
 *మెడికల్ బిల్లు కోసం రూ.25 వేలు లంచం.. ఫోన్ పే లో తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలలో* *నాగర్ కర్నూల్, అక్టోబర్ 06:* నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రెజరీ అధికారి అవినీతి బయటపడింది. మెడికల్ లీవ్ బిల్లు ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసి ఫోన్ పే ద్వారా తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.151 ప్రకారం..* *నిందితుడు: శ్రీ కందడ వెంకటయ్య, సీనియర్ అకౌంటెంట్, సబ్ డివిజనల్ ట్రెజరీ ఆఫీస్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా.* ఫిర్యాదుదారుడి మెడికల్ లీవ్ మరియు దానికి సంబంధించిన బిల్లులు/అలవెన్సులు ప్రాసెస్ చేయడానికి అకౌంటెంట్ వెంకటయ్య రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు. ఆగస్టు 14, 2026న ఫిర్యాదుదారుడి నుండి రూ.3,000 నగదుగా తీసుకున్నాడు. మిగిలిన రూ.22,000 లంచాన్ని ఆగస్టు 18, 2026న ఫోన్ పే ద్వారా బదిలీ చేయించుకున్నాడు. అక్రమ లబ్ధి పొందే ఉద్దేశంతో తన అధికార విధులను సక్రమంగా నిర్వర్తించకుండా నిందితుడు వ్యవహరించాడని ఏసీబీ పేర్కొంది. దీంతో అతనిపై క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని నాంపల్లిలోని I అదనపు స్పెషల్ జడ్జి ఫర్ SPE & ACB కేసుల కోర...

*భవన నిర్మాణానికి రూ.8 లక్షల లంచం డిమాండ్.. రూ.4 లక్షలతో ఏసీబీకి చిక్కిన GHMC అధికారి*

Image
 *భవన నిర్మాణానికి రూ.8 లక్షల లంచం డిమాండ్.. రూ.4 లక్షలతో ఏసీబీకి చిక్కిన GHMC అధికారి* *హైదరాబాద్, అక్టోబర్ 05:* GHMCలో మరో టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి వ్యవహారం బట్టబయలైంది. గోల్కొండ జోన్‌లో భవన నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని లక్షల్లో లంచం డిమాండ్ చేసిన సూపర్‌వైజర్ ఏసీబీ వలలో పడింది. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.149 ప్రకారం..* *నిందితురాలు: శ్రీమతి తులసిరాం సునీత, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, GHMC, గోల్కొండ జోన్, సర్కిల్-33, మెహదీపట్నం, హైదరాబాద్.* అక్టోబర్ 05, 2026న సిటీ రేంజ్-I ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడి భవన నిర్మాణంపై GHMC డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్లను పట్టించుకోకుండా ఉండేందుకు, నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించి, ఇకపై ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా సహకరించేందుకు సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుండి లంచం సొమ్ము రూ.4 లక్షలతో పాటు, లెక్కల్లో లేని మరో రూ.2.50 లక్షల నగదు కూడా బయటపడింది. రెండు మొత్తాలను అధికారుల...

*మ్యుటేషన్ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్*

Image
  *మ్యుటేషన్ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్* *సిద్దిపేట, అక్టోబర్ 06:* సిద్దిపేట జిల్లాలో మరో అవినీతి ఉద్యోగి ఏసీబీ వలలో పడ్డారు. నారాయణరావుపేట మండలంలో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. *AO-1: శ్రీమతి బి. అరుణ, పంచాయతీ కార్యదర్శి, జక్కాపూర్ గ్రామం, నారాయణరావుపేట మండలం* *AO-2: దాసరి సంతోష్, కాంట్రాక్ట్ కారోబార్, జక్కాపూర్ గ్రామం* అక్టోబర్ 06, 2026 ఉదయం 11 గంటల ప్రాంతంలో జక్కాపూర్ పంచాయతీ ఆఫీసులో ఇద్దరూ రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడి పేరు మీద రెండు ఇళ్లకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ఫార్వార్డ్ చేసి ప్రాసెస్ చేయడానికి పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం డిమాండ్ చేసింది. మొదట రూ.20,000 అడిగి, చివరకు రూ.15,000 కు బేరం కుదుర్చుకుంది. ఆ డబ్బును కారోబార్ సంతోష్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్నారు. లంచం సొమ్ము రూ.15,000 ను AO-2 సంతోష్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఏసీ...

*రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలి* - చైర్మన్ రాజశేఖర్ రెడ్డి

Image
  *రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలి* *జోనల్, డివిజనల్, రీజినల్ స్థాయి అధికారులకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి లక్కడి దిశానిర్దేశం* *హైదరాబాద్ సనత్ నగర్ లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విధులు, కార్యకలాపాల పై ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి, మెంబర్ సెక్రటరీ రవి ఆధ్వర్యంలో విస్తృత చర్చ* *ఫలితాల ఆధారిత కార్యాచరణ విధానాన్ని (Result Orineted Approach) అనుసరించాలని అధికారులకు సూచించిన చైర్మన్* *పిసిబి ప్రధాన కార్యాలయంతో పాటు, రీజినల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత సమస్య పై దృష్టి పెడతానని స్పష్టం చేసిన చైర్మన్* *రీజియన్ల వారీగా పరిశ్రమల అనుమతులకు సంబంధించిన స్టేటస్ ను ఆరా తీసిన మెంబర్ సెక్రటరీ* *కాలుష్య నియంత్రణతో పాటు కాలుష్య నివారణకు ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు టిజిపిసిబి చైర్మన్, ఎంఎస్ మార్గనిర్దేశనం* *పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలు, ఇతర సంస్థల పై కఠిన చర్యలకు ఆదేశం* రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పర్యవేక...