జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు* – హెడ్ ఆఫీస్ లో టిడిఆర్ పాలసీ, ‘బిల్డ్ నౌ’, లేఅవుట్ అనుమతి వ్యవస్థలపై GHMC కమిషనర్ బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్, జూలై 24, 2025: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్, అధికారులు ప్రశంసించారు. గురువారం జైపూర్ అభివృద్ధి సంస్థ (JDA) కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతి గుప్తా, ఐటీ సలహాదారు ఆర్.కె. శర్మా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మ లతో కూడిన ప్రతినిధి బృందం ట్రాన్స్ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) పాలసీ, బిల్డ్ నౌ (Build Now) అనే ఏకీకృత భవన మరియు లేఅవుట్ అనుమతి వ్యవస్థ ల అధ్యయనం కోసం GHMC ను సందర్శించారు . గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బృందానికి అధికారులు స్వాగతం పలికారు. ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ TDR పాలసీ ,2017 లో ప్రవేశపెట్టిన నూతన టిడిఆర్ పాలసీ ముఖ్యాంశాలు, పాలసీ ప్రయోజనాలు, భవన, లేఅవుట...