జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివి - అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివి - అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
*పదవీ విరమణ పొందిన 18 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం*
*హైదరాబాద్, జులై 31, 2025:* జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివని అదనపు కమిషనర్ (హెల్త్ , శానిటేషన్) రఘు ప్రసాద్
అన్నారు. గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 18 మంది అధికారులు, ఉద్యోగులకు అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్, అదనపు కమిషనర్ లు వేణు గోపాల్, గీతా రాధిక, సీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజా, పిఆర్ఓ మామిండ్ల దశరథం లతో కలిసి శాలువా, పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్ మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగికి తాము అందించిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని అన్నారు. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు.
*పదవీ విరమణ పొందిన వారి వివరాలు:*
చీఫ్ ఇంజనీర్ (ఎస్.ఎన్.డి.పి) ఎం. కోటేశ్వరరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డి.నరేందర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పి.రవీందర్, సూపరింటెండెంట్ బి.స్వామి, గేమ్స్ ఇన్ స్పెక్టర్ ఇంతైజ్ అహ్మద్, హెవి వెహికల్ డ్రైవర్ మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్ కె.మోహన్ రాజ్, ఆఫీస్ సబార్డినేట్ డి.నర్సింగ్ రావు, ఛైన్ మెన్ ఎం.యాదయ్య, పి.హెచ్ వర్కర్ కె.ముత్తమ్మ, కామాటి జి.పెంటయ్య, కామాటన్ లు బాలమణి, యాదమ్మ, లక్ష్మీ భాయి, లక్షమ్మ, మాలీ లు కె. ఎల్లయ్య, నర్సింహ్మ.
కార్యక్రమంలో అడిషనల్ ఏ.ఎం.సి లు జీవన్ కుమార్, శారద, ఉన్నత శ్రేణి సహాయకులు రోహిత్ , సహ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment