వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి - జీహెచ్‌ఎంసీ కమిషనర్
*–నగరంలోని వరద ముప్పు ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్ర పర్యటన, అధికారులకు సూచనలు*
హైదరాబాద్ 23, జులై,2025:
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వర్షపు నీరు నిలుస్తూ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్, జోనల్ కమిషనర్ (సెరిలింగంపల్లి జోన్) భోర్ఖడే హేమంత్ సహదేవరావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , సిబ్బందితో కలిసి సెరిలింగంపల్లి జోన్ లో క్షేత్ర పరిశీలన చేశారు.
మెడికవర్ హాస్పిటల్ సమీపంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్ కమాన్ వద్ద వరద నీటి డ్రైనేజీని కమిషనర్ పరిశీలించారు.
ఆ తర్వాత, శిల్పరామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట లేక్స్ ఔట్‌లెట్ పాయింట్‌ను సందర్శించారు.
తదుపరి, హై-టెక్ సిటీలోని యశోద హాస్పిటల్ రోడ్డుపై స్మైలైన్ డెంటల్ వద్ద నీటి నిల్వ పాయింట్‌ను పరిశీలించారు.
స్మైలైన్ డెంటల్ హాస్పిటల్ వద్ద యశోద రోడ్డుపై తుఫాను నీటి డ్రైన్ నిర్మించాలని, తమ్మిడికుంట సరస్సు వద్ద హైడ్రా చేత పడవేయబడిన వ్యర్థాలను తొలగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
వర్షం పడినప్పుడు వరదతో పాటు పెద్దమొత్తంలో చేరుతున్న సిల్ట్ ను వెనువెంటనే తొలగించాలని అధికారులు ఆదేశించారు
అనునిత్యం అప్రమత్తంగా ఉండి వరద నివారణతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
క్షేత్ర పరిశీలన లో హైడ్రా కమీషనర్ రంగా నాథ్ కూడ ఉన్నారు.
Comments
Post a Comment