ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం: కాచం సత్యనారాయణ గుప్త.


 స్థానిక సంస్థల్లో వైశ్యులకు వాటా తేల్చాల్సిందే
 . 

ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం:  కాచం సత్యనారాయణ గుప్త.

హైద్రాబాద్, గూఢచారి: 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనని, ఆగస్టు 3 వ తేదీన హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దామని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. మంగళవారం చైతన్యపురిలోని వైశ్య వికాస వేదిక కార్యాలయంలో వైశ్య జర్నలిస్టు లతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్య వికాస వేదిక స్థాపించి దాదాపు ఏడు సంవత్సరాల అయిందని తెలిపారు. ఏడు సంవత్సరాల కాలంలో ఈ వేదిక ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించమని, కరోనా సమయంలో ఎంతోమంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందచేయడం జరిగిందన్నారు. వైశ్య పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో 90 శాతం దాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మెమొంటో , సర్టిఫికెట్ , శాలువాతో సన్మానించడం జరిగిందని తెలిపారు. 

 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలని అన్నారు. వైశ్యులు ఎవరి వాటాలను అడగడం లేదని మేమెంతో మాకు అంతా సీట్లు కేటాయించాలని అన్నారు.. సమాజంలో వైశ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు వైశ్యులకు కూడా అవకాశం కల్పించాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ తేవాలని, కులగనన నివేదికలో అగ్రవర్ణాల వివరాలు కులాలవారీగా ప్రకటించాలని అన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల ఆర్యవైశ్యులు పాల్గొని వైశ్య రాజకీయ రణబేరి ని విజయవంతం చేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  కోటగిరి చంద్రశేఖర్, భూపతి రాజు, బళ్ళు చంద్ర ప్రకాష్, త్రినాథ్ గుప్తా, నటరాజ్, స్వయం ప్రకాష్, పబ్బు శ్రీనివాస్, శ్రీనివాస్, రాజు గుప్తా, వైశ్య వికాస వేదిక సభ్యులు భూక్క ఈశ్వరయ్య, కోడుమూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం