జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు


జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు*


– హెడ్ ఆఫీస్ లో టిడిఆర్ పాలసీ, ‘బిల్డ్ నౌ’, లేఅవుట్ అనుమతి వ్యవస్థలపై GHMC కమిషనర్ బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్


హైదరాబాద్, జూలై 24, 2025:


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్, అధికారులు ప్రశంసించారు.



గురువారం జైపూర్ అభివృద్ధి సంస్థ (JDA) కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతి గుప్తా, ఐటీ సలహాదారు ఆర్.కె. శర్మా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మ లతో కూడిన ప్రతినిధి బృందం ట్రాన్స్ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) పాలసీ, బిల్డ్ నౌ (Build Now) అనే ఏకీకృత భవన మరియు లేఅవుట్ అనుమతి వ్యవస్థ ల అధ్యయనం కోసం GHMC ను సందర్శించారు .


 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బృందానికి అధికారులు స్వాగతం పలికారు. 

ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ TDR పాలసీ ,2017 లో ప్రవేశపెట్టిన నూతన టిడిఆర్ పాలసీ ముఖ్యాంశాలు, పాలసీ ప్రయోజనాలు, 

భవన, లేఅవుట్ అనుమతుల కోసం ఉద్దేశించిన ‘బిల్డ్ నౌ’ అనే సింగిల్-విండో ప్లాట్‌ఫామ్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృంద సభ్యులకు వివరించారు.




ఈ విధానాల ద్వారా GHMC పరిధిలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ సులభతరం చేయడంతో పాటు

పౌర సేవలలో పారదర్శకత, సమర్థత, బాధ్యతను పెంచడం జరిగిందని కమిషనర్ బృందానికి తెలిపారు. అనుమతి ప్రక్రియ సమయాన్ని తగ్గించి, నిబంధనల అమలును పక్కగా అమలుకు వీలు కలిగిందని కమిషనర్ తెలిపారు. GHMC విధానాలను ప్రశంసించిన బృంద సభ్యులు

జైపూర్ నగర పరిపాలనను బలోపేతం చేసేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు ఇలాంటి వ్యవస్థలను అక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.  GHMC చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ రావు, అదనపు సి సి పి లు గంగాధర్ , ప్రదీప్ కుమార్, ప్రతినిధుల అధ్యయన టూర్ సమన్వయ కర్త లు రాజ్ కుమార్ , విల్సన్ లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు

 

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం