మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు


 జై వాసవి జై జై వాసవి 

మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడి బహిరంగ ప్రకటన చదవండి.

 తెలంగాణ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ మెంబర్ లందరికీ నమస్కారం, ఈనెల 17వ తారీఖున రాష్ట్ర మహాసభ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు కింది విషయాలను గమనించి ఓటు వేయగలరని మనవి,


 *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకత్వ మార్పు కోసం పోరాటం చేస్తున్న మిడిదొడ్డి శ్యాంసుందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం, ఏ మంచి పని అయినా మారుపుతోనే సాధ్యం.* 


 ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అమరవాది లక్ష్మీనారాయణ గారు నైతికంగా ఓడిపోయారు.


 అమరవాది లక్ష్మీనారాయణ గత 13 సంవత్సరాలుగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా కొనసాగారు, మళ్లీ అతనికి అధ్యక్ష పదవి కట్టబెడదామా??


 తెలంగాణ రాష్ట్రంలో అమరవాది లక్ష్మీనారాయణ గారు తప్ప వైశ్య కులంలో ఎవరు తెలివిగల వాళ్ళు, సమర్ధులు, నాయకత్వ లక్షణం గల వాళ్ళు లేరు అనుకోని ఎప్పటికీ తానే శాశ్వతంగా నియంత మాదిరిగా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారు, అతనిని సమర్థిద్దామా??


 రాష్ట్రంలో ఆర్యవైశ్య కులంలో ఎటువంటి పదవి అయినా సరే తనకే కావాలంటారు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా 13 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు అయినా మళ్లీ తనకె అధ్యక్ష పదవి కావాలి అని పోటీ చేస్తున్నారు , రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు మళ్లీ తనే రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు,

గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు మరి ఇప్పుడు కండువా మార్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ లో వైశ్య కులం తరపున తనకె ఎమ్మెల్సీ సీటు కావాలని వినతిపత్రం సమర్పించుకున్నారు ఆయనకి ఎన్ని పదవులు వచ్చినా పదవి దాహం తీరదు 


 వైశ్య కులం తరపున అన్ని ఉన్నత పదవుల్లో తానే ఉండాలి, సంఘంలో తానే ఉండాలి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో తానే ఉండాలి, ఏ గవర్నమెంట్లో అయినా తానే ఉండాలి ఎవరిని ఎదగనివ్వడు ఎవరికి అవకాశం కల్పించడు అన్ని తనకే కావాలి.


 దయవుంచి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు అందరూ తెలంగాణ రాష్ట్రంలోని పేద ఆర్యవైశ్య కుటుంబాల తరఫున పేద ఆర్యవైశ్య విద్యార్థుల తరఫున ఒకసారి ఆలోచించి మనస్సాక్షిగా అమ్మవారి సాక్షిగా నాయకత్వ మార్పుకు ఓటు వేయాలని కోరుతున్నాం,

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ