తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం
ఎవరి ధీమా వారధి
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం
*ముందంజ లో శ్యామ్ సుందర్*
*అపవాదు ముట్టగట్టుకున్న అమరవాది.*
హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ మహాసభ కు మొదటి సారి ఎన్నికల పోలింగ్ మంగళవారం లక్డికపూల్ వాసవి సేవ కేంద్రమంలో జరగనుంది.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన అమరవాది లక్ష్మీనారాయణ, కరీంనగర్ కు చెందిన బుస్సా శ్రీనివాస్ లు ఈ ఎన్నికల్లో పోటీపడు తున్నారు. అయితే ఉపసంహరణ అనంతరం బుస్సా శ్రీనివాస్ విరమించుకున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.
గత 12 ఏండ్ల నుండి ఎన్నికలు అమరవాది జరపలేదని అక్రమంగా ఉన్నాడని, శ్యాంసుందర్ వర్గం కోర్టుకు పోయి అమరవాది అక్రమాలను ప్రశ్నించడం తో కోర్టు అడ్వకేటు కమీషనర్ చే ఎన్నికలు కొనసాగించడానికి ఆర్డర్ ఇచ్చింది.
గత సంవత్సరం ఎన్నికలు ప్రకటించిన అమరవాది బైలా కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అక్రమంగా శ్యాంసుందర్ నామినేషన్ ను తిరస్కరించడం తో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అమరవాదిని ముద్దాయిగా ఆర్యవైశ్యులు భావిస్తున్నారు. దానితో శ్యాంసుందర్ రాష్ట్రం లో ఎక్కడికి ప్రచారానికి వెళ్లిన ఆయనకు ఆర్యవైశ్యులు బ్రహ్మరథం పట్టారు.
12 ఏండ్లు ఎన్నికలు లేకుండా నిరంకుశత్వం తో అధ్యక్షుడిగా కొనసాగిన అమరవాది పై రాష్ట్ర ఆర్యవైశ్యులు ఆగ్రహం తో ఉన్నారు. ఏ సోషల్ మీడియా పోస్టు చూసినా అమరవాది పై భారీఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.
ఈ ఎన్నికలో రాష్ట్రం లో మొత్తం 1109 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటారు. ఇందులో మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
అమరవాది నిరంకుశత్వం తో 12 ఏండ్లు ఉండడం తో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులో ఎక్కువ శాతం నాకే ఓటు వేస్తారని శ్యాంసుందర్ భావిస్తున్నారు. అదే విధంగా స్పందన కూడా అలాగే కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య మహాసభ కౌన్సిల్ మెంబర్లు సైలెంట్గా తమ ఓటు శ్యాంసుందర్ కు వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఎక్కడ చర్చ జరిగిన ఆది అమరవాదికి వ్యతిరేకంగానే జరుగుతుంది.
ఇంకో వైపు అమరవాది కౌన్సిల్ లిస్ట్ నా పర్యవేక్షణలో జరిగింది ఇది తనకు అనుకూలంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
శ్యాంసుందర్ కు మద్దతుగా ఎక్కువ శాతం రాష్ట్ర లోన ఆర్యవైశ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరియు వైశ్య ఏకైక ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధనాపాల్ సూర్యనారాయణ గుప్త మరియు ఆర్యవైశ్య ఏకైక ఎమ్మెల్సి బొగ్గారపు దయానంద్ తో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత మరియు ఐవిఎఫ్ సీనియర్ నాయకుడు గంజి రాజమౌళి గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త, మొగుళ్ళపల్లి ఉపేందర్, గట్టు మహేష్, యదా నాగేశ్వరరావు, బచ్చు రామకృష్ణ, చకిలం రమణయ్యలు, తెడ్ల జవహర్ బాబు, యా మురళి, వనమా మనోహర్, శ్యాంసుందర్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
అమరవాది కి ఆయన చుట్టూ ఉన్న కొఠారి, మరియు పదవులు ఆశిస్తున్న వారు ప్రచారం చేస్తున్నారు.ఎవరు విజయం సాధిస్తారనేది ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే.

Comments
Post a Comment