తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  ఎన్నికలకు అంగీకరించిన అమరవాది -  మిడిదొడ్డి శ్యామ్ సుందర్ హైద్రాబాద్:  (గూఢచారి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  ఎన్నికలకు  నిర్వహించుటకు అమరవాది అంగీకరించి కార్యవర్గ సమావేశంలో తీర్మానించి నట్లు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు కర్మన్ ఘాట్  వేడుక కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఈ రోజు  జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ మీటింగ్ లో   మహాసభ  ఎన్నికలు  నిర్వహించుటకు అమరవాది అంగీకరించి  ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించి నట్లు శ్యామ్ సుందర్ తెలిపారు.  రెండు, మూడు నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయన  అన్నారు.    ఈ సమావేశం లో మలిపెద్ది శంకర్, కాచం సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ,  మొగుళ్లపల్లి ఉపేందర్, యాదా నాగేశ్వర రావు,  మోటూరి శ్రీకాంత్, బొడ్ల మల్లిఖార్జున్, అర్థం శ్రీనివాస్, వందనపు వేణు, పుల్లూరు సత్యనారాయణ, బాలరాజు,  కొండూరు గణేష్, కొండూరు రాజేశ్వరి మరియు పలు జిల్లాల నుండి సుమారు 300 మంది పాల్గొన్నారు.
 
Comments
Post a Comment