ఆది పరాశక్తి


 *ఆది పరాశక్తి*


*పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు "రాక్షసి" అంటే, హర్షించినవారు "ఆదిపరాశక్తి" అంటారు.*


*ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ.*


*మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా ఇలాంటి లేడీ ఆఫీసర్ చేసిన నటిని "ఎంతబాగా చేసిందో" అంటూ ఉంటాం.*


*అదే దృశ్యం నటన కాకుండా నిజం అయితే?*💪


*హైదరాబాదులో కవిత అరెస్టు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కచ్చితంగా అపూర్వం. భానుప్రియ ఆ రెండు విధులునూ ఎంత తెగింపుతో చేసిందో, ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేసిందో, ఎంత పరిపక్వత, అనుభవం చూపించిందో చూసినవారు చప్పట్లు కొట్టిఉంటారు.*


*కల్వకుంట్ల తారక రామారావుని "ఎక్కువ మాట్లాడితే నిన్నూ జైల్లో పడేస్తా" అనడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి?*


*తొమ్మిది సార్లు తప్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ను పదవసారి కారెక్కెంచుకుని తన ఆఫీసుకి లాక్కెళ్ళిన ధీశాలి భానుప్రియ మీనా.*


*గుండె ధైర్యం మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా ఉంటుంది. కానీ, వాడే సందర్భాలు లెక్క పెట్టవచ్చు.*


*వాడాలి అనుకున్నారా.... వారి పేరు భానుప్రియ మీనానే.*🙏

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్