LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల


 


LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల 

*LRS పై భట్టి మాటలు.. వట్టి మాటలేనా..*
*ఉత్తమ్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనా..!*
*గతంలో LRSపై కోర్టు కెళ్ళిన కోమటిరెడ్డి... ఇప్పుడు ఏ బార్లో తాగిపడుకున్నాడు*
*LRS పేరుతో 20 వేల కోట్ల దోపిడికి కాంగ్రెస్ కుట్ర..*
*నో ఎల్ ఆర్ ఎస్.. నో కాంగ్రెస్....
.ఈ ఉత్తమ కుమారుల పాలనకు ఇక విఆరెఎస్సే...*


*LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు... వట్టి మాటలయ్యాయని..ఉత్తమ్ కుమార్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనని ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు.

బారుకు వెళ్ళడమే తెలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. గతంలో LRSపై కోర్టుకు వెళ్ళారని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తే ఎక్కడకి పోతాడో చెప్పాలని వారు ప్రశ్నించారు.

LRSను ఉచితంగా అమలు చేయాలని క్లాక్ టవర్ సెంటర్లో BRS రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం ధర్నా కార్యక్రమం చేపట్టింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు హాజరయ్యారు.

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెసు అధికారంలోకి వస్తే LRS రద్దు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే సామాన్య ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల బాదుడుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని వారు మండిపడ్డారు*

*LRS పై మాట మార్చిన కాంగ్రెస్ ను బొందపెట్టాలనీ ప్రజలు అనుకుంటున్నారని.. ఇక కాంగ్రెస్ కు గోరి కట్టే సమయం ఆసన్నమైందని అన్నారు*

*మేము చేస్తే సంసారం.. ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లు కాంగ్రెసు ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని వారు అన్నారు.

ఈ ఉత్తర కుమారుల పాలనలో తెలంగాణ ఎడారిగా మారుతుందని.. నీళ్లు లేక పొట్టకొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకుంటున్నారని.. ఇంత జరుగుతున్నా గుంపుమేస్త్రీ ప్రభుత్వం ఏం చేస్తుందనీ వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

LRSను ఉచితంగా అమలు చేసేంత వరకు మా పోరాటం ఆగదని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు, చైర్మన్ వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ పట్టణ మండల కమిటీ సభ్యులు, పార్టీ పట్టణ వార్డు కమిటీ సభ్యులు, ఇన్చార్జులు, గ్రామ కమిటీలు అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్