ఏసీబీ వలలో JAO


 ఏసీబీ వలలో JAO

హబ్సిగూడ విద్యుత్ కార్యాలయంలో దాడులు

జూనియర్ అకౌంట్స్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం చోటు చేసుకుంది. నాచారం ఏడీఈ కార్యలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్ భరత్కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్ అకౌంట్స్ అధికారి విజయ్ సింహారెడ్డిని కొద్దిరోజులగా వేడుకుంటున్నాడు. లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేద న్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడదల చేసేందుకు రూ.35వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో హైదరాబాద్-2 ఏసీబీ యూనిట్ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలోనే శుక్రవారం విజ య్ సింహారెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నాంపల్లి కోర్టుకు తరలించి చంచల్గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు కోరారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*