**_బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం? _**

_బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం? _


_దిల్లీ:


బంగారమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే. అలాంటి బంగారంపై పరిమితుల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందట. అంతకంటే ముందు ఒక కొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారం ఇప్పటి వరకు లెక్కల్లో చూపని పసిడిని బహిర్గతం చేసి 'పన్ను' చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం._
_ఈ పథకం కింద వ్యక్తులు వద్ద పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం కల్పిస్తారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ పన్ను రేటు ఎంత ఉంటుంది..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి. త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందట. 2014-16 మధ్యలో ప్రభుత్వం నల్లధనంపై ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకాల మాదిరిగానే ఇది కూడా ఉండవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాంపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది._దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి పెద్దమొత్తంలో నల్లడబ్బును పసిడిలో పెట్టుబడిపెడుతున్నారు. దీంతో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం వెలువడలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా బంగారంపై పరిమితుల్లో మార్పులు చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, అప్పట్లో అలాంటిదేమీ జరగలేదు._


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ