*సూర్యాపేటలో లంచం తీసుకుంటూ గ్రౌండ్ వాటర్ అధికారి ACB కి చిక్కారు*



*సూర్యాపేటలో లంచం తీసుకుంటూ గ్రౌండ్ వాటర్ అధికారి ACB కి చిక్కారు*


*సూర్యాపేట:* బోరువెల్ డ్రిల్లింగ్ రిగ్‌కు అనుమతి ఇప్పిస్తానని, ఫైన్ వేయకుండా చూస్తానని లంచం డిమాండ్ చేసిన సూర్యాపేట జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


ACB నల్గొండ రేంజ్ అధికారులు అందుకున్న ఫిర్యాదు మేరకు 15-07-2026 న ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ *మేగావత్ బాలు* రూ.20,000 లంచం డిమాండ్ చేసి, డేటా ఎంట్రీ ఆపరేటర్ *కోసనోజు వెంకటేశ్వర్లు* ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం సొమ్మును AO-2 వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.


ప్రభుత్వ అనుమతులు, సర్టిఫికెట్ల పేరుతో సామాన్య ప్రజల నుండి లంచాలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ACB అధికారులు హెచ్చరించారు.


ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే వెంటనే *ACB టోల్ ఫ్రీ 1064* కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుదారు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.


ఇద్దరు నిందితులను నంపల్లి ACB స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉంది.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు