బేగంపేట మెట్రో స్టేషన్‌కు  తాళం 

 


బేగంపేట మెట్రో స్టేషన్‌కు  తాళం 



హైదరాబాద్‌ : బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ సోమవారం చలో ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కారులు స్టేషన్‌లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్‌లో నోటీసు అంటించారు. 


కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస​ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్‌ అలీతో పాటు పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ