**బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు**


బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి విజయవాడకు రూ.3.18కోట్ల విలువైన 8.86 కిలోల బంగారం తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద వారిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని అంధేరికి చెందిన జయేష్‌ జైన్‌.. విజయవాడలోని ఇస్లాంపేటకు చెందిన పాగోలు శ్రీనివాసరావు ముంబయి నుంచి బంగారు ఆభరణాలు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారిని విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న పోలీసు అధికారులను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్