మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు
మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు
హైదరాబాద్:
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బ్యాలెన్స్ కొందరు 3కోట్లు అని, కొందరు 6 కోట్లు అని, ఇంకొందరు 11 కోట్లు ఉండాలి అంటున్న వార్తల మేరకు విషయములో ఏది నిజమో తెలవాలంటే రికార్డులు బహిర్గతం కావాల్సిందేనని ఆర్యవైశ్య జర్నలిస్టు భూపతి రాజు అంటూ సమాచారం కొరకు తాను rti దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.
సభ్యత్వ రుసుము లో జిల్లాలకు ఇవ్వవలసిన వాటాలు దాదాపు 11 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదనీ. ఉమ్మడి మహాసభ నుండి పంచుకున్న విద్యానిధి నుండి స్కాలర్షిప్ ఇవ్వలేదని, సేవా కార్యక్రమాలు కూడా చేసిన దాఖలాలు లేవనీ ఆయన అన్నారు, వసూలైన సభ్యత్వం రుసుము భద్రంగా ఉందా, పంచుకున్న నిధులు, విద్యా నిధి నిలువలు ఉన్నాయా? లేక ఖర్చుల క్రింద ఆవిరి అయ్యాయా? అన్న విషయం ఆర్యవైశ్యులకు ముఖ్యంగా సభ్యులకు తెలవలసి ఉందని తెలిపారు. రికార్డులు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.
ఆయనతో పాటు ఆర్యవైశ్య నాయకులు 13 మంది కూడా rti దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో మాజీ జిల్లా అధ్యక్షులు వరంగల్ కు చెందిన మునుగోటి రమేష్, జగిత్యాల కు చెందిన పుల్లూరి సత్యనారాయణ, కరీంనగర్ అర్బన్ మాజీ అధ్యక్షుడు AV మల్లిఖార్జున్, సీనియర్ జర్నలిస్టు కే. చంద్రశేఖర్, ప్రక్షాళన కమిటీ నాయకులు మెదక్ కు చెందిన మ్యాడం బాలకృష్ణ, గడ్డం శ్రీనివాస్, చిట్యాల కు చెందిన మేడుశెట్టి ఉమాశంకర్, కోరుట్ల కు చెందిన అల్లాడి శ్రీనివాస్, భద్రాద్రికొత్తగుడం కు చెందిన డి. నాగేష్, కూర ప్రసాద్, కరీంనగర్ కు చెందిన కైలాస నవీన్, సిరిసిల్లకు చెందిన చేపూరి అశోక్, కమాన్పూర్ కు చెందిన కోలేటి శ్రీనివాస్ లు ఉన్నారు.
ఆ Rti దరఖాస్తులో జిల్లా రిజిస్ట్రార్, మైత్రి విహార్ ,అమీర్ పేట, హైదరాబాద్ వారికి ఈ కింద కోరిన సమాచార వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇప్పించాల్సిందిగా వారు కోరారు
(1) 01/ 04/ 2020 నుండి 24/03/2026 నాటికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నిర్వహించిన క్యాష్ బుక్, లెడ్జర్ జిరాక్స్ కాపీల నకళ్ళను సర్టిఫైడ్ తో ఇప్పించాలి
(2)తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ సంస్థ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు సమర్పించిన రిటర్న్స్ కాపీల నకళ్ళను సర్టిఫైడ్ తో ఇప్పించాలి
(3)తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో 24/03/ 2026 నాటికి ఉన్న సభ్యుల లిస్టు మరియు స్టేట్ కౌన్సిల్ నెంబర్ల లిస్టు నకళ్ళను సర్టిఫైడ్ తో ఇప్పించాలి..
వెంటనే అధికారులు సమాచారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments
Post a Comment