అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది!


 అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది!

తొందర పాటు తో తప్పులు చేయొద్దు!

టీయూ డబ్ల్యూ జే జిల్లా నేతలు 


సంగారెడ్డి :

అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తుల కు సంబంధించి సోమవారం వరకే గడువు అనేది పూర్తిగా అవాస్తవం అని టీ యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట ఉపాధ్యక్షుడు ఎం ఎ కే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అసిఫ్ పేర్కొన్నారు. ఇంకా జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటు కాలేదని వారన్నారు. ఈ కమిటీ ఏర్పాటు కావడానికి సమయం పడుతుందని అన్నారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం జరగడానికి మరో రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ సమావేశం జరిగి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టు మిత్రులందరికీ కార్డులు వచ్చే విధంగా కొన్ని గైడ్ లైన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఈ కారణంగా దరఖాస్తు చేసుకునే గడువు ఇంకా ఉన్నదని స్పష్టం చేశారు. జర్నలిస్టు మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. అందరూ ఒకటే సారి దరఖాస్తు చేస్తున్నందున,సర్వర్ లో కూడా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈ తొందర పాటు లో తప్పులు దొర్లే అవకాశం ఉన్నదని వారు అన్నారు. తప్పులు దొర్లితే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. గడువు ఇంకా ఉన్నందున ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని వారు సూచించారు. రెండు సంవత్సరాల తర్వాత కొత్త కార్డులు వస్తున్నాయని, అర్హులందరికీ అక్రెడిటేషన్ కార్డు రావాలని యూనియన్ నేతలు ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన