ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!


 


ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!

రిటర్నింగ్ అధికారికి హై కోర్టు నోటీసులు!

ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుల మొట్టికాయలు

ఫిబ్రవరి 8నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను తాత్కాలిక నిలిపివేత

మార్చి 4 వరకు స్టేటస్ కో

ఈ పిటిషన్లపై మార్చి 21న విచారణ

హైద్రాబాద్, గూఢచారి:

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలపై కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి తదనుగుణంగా తీర్పుల నిచ్చాయి. ఏ వెంకటేశం అనే వ్యక్తి హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు చీఫ్ జడ్జి – 2 మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియపై స్టేటస్కో విధిస్తూ యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. మహాసభ ఎన్నికల కోసం ఈనెల 8వ తేదీన విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. మార్చి 4వ తేదీ వరకు స్టేటస్కు కొనసాగుతుందని ఆదేశించారు. మహాసభ అధ్యక్ష ఎన్నిక కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలన్న అభ్యర్థులతో పాటు తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన