అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
నల్లగొండ, జూలై 30: చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన రెండు కుటుంబాలకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రూ.2.30 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
బుధవారం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ దేవస్థానాన్ని సందర్శించి, అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇళ్లు, దుకాణాలను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంగా చెక్కులను అందజేశారు.
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున రంగా శ్రవణ్ కుమార్‌కు రూ.1 లక్ష, కర్నాటి యెల్లయ్యకు రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున రూ.20 వేల నగదు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కార్యదర్శి రేపాల భద్రాద్రి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. మొత్తంగా రెండు కుటుంబాలకు రూ.2.30 లక్షల సహాయం అందింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కొండే మల్లికార్జున్, కోశాధికారి రేణిగుంట గణేష్ గుప్తా, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇడుకుళ్ళ రామకృష్ణ, కోఆర్డినేట్ చైర్మన్ చింతల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి జైని రాములు, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుండా నాగరాజు, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ అధ్యక్షుడు పానుగంటి మల్లయ్యతో పాటు పలువురు నాయకులు, సభ్యులు హాజరయ్యారు.
అలాగే చెరువుగట్టు దేవస్థానం చైర్మన్, డైరెక్టర్లు ఇడుపుల సంపత్, వీరవల్లి రఘునాథ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మాశెట్టి అనంత రాములు, రాజకీయ కమిటీ రాష్ట్ర కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్‌తో పాటు నకిరేకల్, నార్కెట్పల్లి, చిట్యాల, కనగల్ మండలాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర, జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులకు, విరాళాలు అందించిన సంఘాలకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

Comments
Post a Comment