IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన


IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

హైదరాబాద్, జూన్ 27:

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ (IVF) తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ జనరల్ సెక్రటరీగా ఉన్న పబ్బా చంద్రశేఖర్, మహిళా విభాగం అడ్వైజర్‌గా ఉన్న ఆయన సతీమణి పబ్బా స్వప్నలను వారి పదవుల నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది.

శనివారం (జూన్ 27, 2026) నుంచి అమల్లోకి వచ్చేలా వారిని సంస్థ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్ర గవర్నింగ్ బాడీ తీర్మానం మేరకు "కొన్ని అనివార్య కారణాల వల్ల" తీసుకున్నట్లు వెల్లడించింది. 

అంతేకాకుండా, పబ్బా చంద్రశేఖర్‌ను IVF బెనారస్ ఆనంద నిలయం–వారణాసి మేనేజింగ్ ట్రస్టీ, అలాగే వాసవి ఆనంద నిలయం–తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతల నుంచి కూడా తొలగించినట్లు తెలిపింది.

ఈ ప్రకటనపై సెంట్రల్ కమిటీ ఛైర్మన్ అడ్వైజరీ బోర్డ్ గంజి రాజమౌళి గుప్తా, IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంతకాలు చేశారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?