అవగాహన కల్పించేందుకుగాను మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి



  నల్గొండ:     ప్రజలలో అవగాహన కల్పించేందుకుగాను ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

     బుధవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు .

   అనంతరం మాట్లాడుతూ కలెక్టరేట్లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లు బాగుందని, ఇదేవిధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలలో ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను ఇలాంటి మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని చెప్పారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒకటి.

    జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ,సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన