టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం. సత్యనారాయణ రావు పదవీ విరమణ.


 

టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం. సత్యనారాయణ రావు పదవీ విరమణ. 



హైద్రాబాద్, గూఢచారి:  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం సత్యనారాయణ రావు శనివారం పదవీ విరమణ చేశారు. 

 ఈ సందర్భ్భంగా పీసీబీ లో ఏర్పటు చేసిన కార్యక్రమలో సభ్య కార్యదర్శి జి. రవి మాట్లాడుతూ సత్యనారాయణ రావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సంస్థకు ఆయన 36 సంవత్సరాలు అంకితభావంతో చేసిన సేవలను ప్రశంసించారు. సత్యనారాయణ లాగ ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.

తనకు సహకరించినందుకు అధికారులు మరియు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

టిజిపిసిబి అధికారులు మరియు సహచరులు ఆయన పదవీకాలంలో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. 

 సిబ్బంది, అధికారులు  శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి. రఘు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



                                                                                                                      

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్