*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?*


*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?*

*గుడాచారి.పేజ్ | ఎక్స్‌క్లూజివ్* 

*"హైదరాబాద్ ZOలో కుర్చీ వదిలి, పటాన్చెరుకు పరుగు - కారణం అపరిశ్రమలతో కనెక్షన్' కోసమేనా?" - గుసగుసలు*

*పటాన్చెరు, జూన్, 6, 2026:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి RC పురం రీజనల్ ఆఫీసులో నిబంధనలకు పాతరేసి 'సొంత' పాలన నడుస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ AE-2 స్థాయి అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*ప్రభుత్వ వాహనం = సొంత కారు?

ఆఫీసు పనులకు వాడాల్సిన ప్రభుత్వ వాహనాన్ని సదరు AE సొంత అవసరాలకు వాడేస్తున్నారని, రాత్రి పూట ఏకంగా ఇంటికే తీసుకెళ్తున్నారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కేడర్ అధికారులకు మాత్రమే వాహనాన్ని నివాసానికి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. ఈ AEకి ఆ అర్హత లేదని సమాచారం. మరి RO గారు ఏం చేస్తున్నట్లు? నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా? RO వెంటనే సరిచూసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

*'డిప్యుటేషన్' వెనుక అసలు కథేంటి?*

అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ అధికారి అసలు పోస్టింగ్ హైదరాబాద్ జోనల్ ఆఫీసు (ZO)లో. ZOలో ఉంటే పరిశ్రమల యజమానులతో నేరుగా 'ఇంటరాక్ట్' అయ్యే, 'ఫీల్డ్ విజిట్' చేసే ఛాన్స్ తక్కువ. అందుకే పక్కా ప్లాన్‌తో పై అధికారులను 'ప్రసన్నం' చేసుకుని RC పురం ROకు డిప్యుటేషన్ వేయించుకున్నారన్నది ఆఫీసు వర్గాల టాక్.

*"ZOలో కూర్చుంటే ఎవరు కలవరు. ROలో అయితే రోజూ పరిశ్రమలకు వెళ్లొచ్చు, 'డైరెక్ట్ డీల్' చేసుకోవచ్చు. అందుకే ఈ డిప్యుటేషన్ డ్రామా"* అని ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు.


1. ఒక అధికారి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహనం వాడుతుంటే RO ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు?

2. ZOలో పని ఉన్న వ్యక్తి ROకు డిప్యుటేషన్‌పై రావడం వెనుక 'పై' అధికారుల హస్తం ఉందా?

3. 'పరిశ్రమలతో నేరుగా ఇంటరాక్ట్' అవ్వాలనే ఆ AE తాపత్రయం దేనికి సంకేతం? కాలుష్య నియంత్రణ కోసమా? లేక సొంత లాభం కోసమా?

కాలుష్యంతో యాదాద్రి లాంటి జిల్లాలు అల్లాడుతుంటే, PCB క్షేత్రస్థాయి ఆఫీసుల్లో ఇలా 'సొంత' ఎజెండాలు నడిస్తే ప్రజల గతి ఏం కాను? ప్రభుత్వ వాహనం దుర్వినియోగం చిన్న విషయం కాదు. ఇది అవినీతికి తొలి మెట్టు.

*గుడాచారి డిమాండ్:* TGPCB సభ్య కార్యదర్శి వెంటనే జోక్యం చేసుకోవాలి. 1) సదరు AE ప్రభుత్వ వాహనం వాడకంపై విచారణ జరిపి, అర్హత లేకుంటే రికవరీ చేయాలి. 2) ఈ అనుమానాస్పద డిప్యుటేషన్ వెనుక ఉన్న 'పై' అధికారులు ఎవరో తేల్చాలి. 


కొసమెరుపు: ఈ అధికారి తనిఖీల్లో ఎంత క్వాలిటీ ? అనే విషయం త్వరలో


Comments