*500 గ్రాములు గంజాయి పట్టివేత*..


 *500 గ్రాములు గంజాయి పట్టివేత*..


*ఐదుగురు నిందితులు అరెస్టు డిమాండ్*...


ఐదుగురు వ్యక్తుల నుంచి  500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన సంఘటన  సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో జరిగింది.డిఎస్పి వి.ప్రసన్నకుమార్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం...శనివారం ఉదయం 9 గంటల సమయంలో  అనంతారం క్రాస్ రోడ్డు వద్ద  పెన్ పహాడ్ ఎస్ఐ  గోపికృష్ణ  తన పోలీసు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా  ఐదు బైకులపై ఐదుగురు వ్యక్తులు  అతివేగంగా అనుమానాస్పదంగా  దురాజ్ పల్లి వైపు వెళ్తున్నారు. ఎస్సై గోపికృష్ణ తన పోలీస్ సిబ్బందితో వారిని వెంటాడి చాలా చాకచక్యంతో వారిని పట్టుకున్నారు.దొరికినవారు పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంకు చెందిన బొమ్మకంటి గోపి,  పేరం శ్రీకాంత్,పేరం శివ,పెన్ పహాడ్ కు చెందిన ఇంద్రవెల్లి జీవన్ కుమార్,నారాయణ గూడెం గ్రామానికి చెందిన పర్సనబోయిన రమేష్ లు ఉన్నారు. ప్రతి వ్యక్తి దగ్గర 100 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి 500 గ్రాముల గంజాయిని 5 బైకులు,3 సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకొని విచారించారు.బొమ్మ కంటి గోపి,పేరం శ్రీకాంత్ లు గత కొన్ని నెలల క్రితం ఒరిస్సాకు వెళ్లగా ఆ ఒరిస్సా సరిహద్దుల్లో గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా కొనుగోలు చేసుకుని దాచుకున్నట్లు వారు తెలిపినట్లు వారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన తెలిపారు.పెన్ పహాడ్ ఎస్ఐ గోపి కృష్ణను పోలీసు సిబ్బందిని డిఎస్పి ప్రసన్న కుమార్  అభినందించాడు.ఈ కార్యక్రమంలో   సూర్యాపేట రూరల్ సిఐ జి రాజశేఖర్, ఎస్సై గోపికృష్ణ,పోలీస్ కానిస్టేబుల్స్ ప్రవీణ్,మహేష్,వంశీ,  సైదులు,రమేష్,లింగరాజు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం