గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


 గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

Hydrabad, GUDACHARI: 

కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  కిషన్ రెడ్డి  ఈరోజు గాంధీ ఆసుపత్రి నిర్వహణను పరిశీలించి, వైద్య - ఔషధ సదుపాయాలను, రోగులకు అవసరమైన వసతి మరియు భోజన వ్యవస్తలను, వైద్యులకు అవసరమైన పరికరాలను - వ్యవస్థలను, రోగ నిర్ధారణ మరియు పరీక్ష కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించారు. కోవిడ్ మహమ్మారి ప్రబలిన కష్టసమయంలో ప్రధాని  నరేంద్ర మోదీ గారి చొరవతో, "పీ.ఎం. కేర్స్" నిధులతో అత్యవసరంగా, అతితక్కువ సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించి ఆ పరికరాల ప్రస్తుత పనితీరుని, స్థితిగతులను తెలుసుకున్నారు.






గాంధీ ఆసుపత్రిలోని మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. 


గాంధీ దవాఖానాలో రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి అటు వైద్యులను, ఇటు రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధాని  నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందిస్తున్న చికిత్సల గురించి, వైద్య పరీక్షల గురించి సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం మెయింటెనెన్స్‌తో పాటు ఆస్పత్రిలో ఉన్న ప్రస్తుత ఖాళీల గురించి, వైద్య సిబ్బంది సంఖ్యా గురించి, డాక్టర్ల కొరత గురించిన వివరాలను విచారించారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్