శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో అరాచకాలు.....బదిలీ అయినా కదలని ఈవో.....ఆలయ ఆధాయానికి గండి


 శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో అరాచకాలు.....బదిలీ అయినా కదలని ఈవో.....ఆలయ ఆధాయానికి గండి 

హైద్రాబాద్, గూఢచారి: 

2024ఆగస్టు నెలలో దేవాదాయశాఖ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ జరిగాయి. అయినప్పటికీ పెద్దల అండదండల తో కదలని ఈవో మనోహర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఉజ్జయిని అమ్మవారి గోశాలలో ఉండవలసిన మూడు గోవులను నల్లగొండ జిల్లా ఉరుముడ్ల లొని సొంత పొలం కు తరలించిన అడిగే నాధుడు లేరు. 

పదిమంది(ముగ్గురు సన్నాయి వాళ్ళు, ఇద్దరు పురోహితులు, మరో ఐదుగురు )ఉద్యోగులకు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసింది.అయినా గత రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, వేదిస్తున్నారు,

ఏప్రిల్ నెలలో రెగ్యులరైజేషన్ అయినప్పటికీ సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే జీతాలు ఇచ్చారు.

ఐదు నెలల జీతం రెండు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు..బకాయి పడ్డ జీతం... పెండింగ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అంటే రెండు నెలల జీతం సమర్పించుకోవాలి అంటూ ఈవో డిమాండ్ చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఇటీవల కొందరు ఉద్యోగులు తమ అవసరాల కోసం సరెండర్ లీవ్ క్లెయిమ్ చేస్తే Secure stop దగ్గర  8 శాతం Religious staff దగ్గర 10 శాతంతీసుకున్నారని సహా ఉద్యుగులే ఆరోపిస్తున్నారు... నన్ను ఎవరూ ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నడని ఆరోపిస్తున్నారు. ఆలయ ఈ ఓ ఆరాచకాలను అడ్డుకోవలసిన కమీషనర్ కార్యాలయం సిబ్బంది సహకరించడం విశేషం. ఈ ఓ తో పాటు కమీషనర్ కార్యాలయంలోని సిబ్బందిని ప్రక్షాళన చేస్తేనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి మంచి రోజులు వస్తాయని అంటున్నారు.

ఇంకా

ఆయన అక్రమాల పై ఫోకస్ పెట్టిన గూఢచారి

వివరాలు త్వరలో


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ