ఉప్పల నివాసానికి ఉత్తర ప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్
*ఉప్పల నివాసానికి ఉత్తర ప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్*
*ఘనంగా సన్మానించిన ఉప్పల*
నాగోల్ లోని ఉప్పల నివాసానికి ఉత్తర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి విద్య శాఖ మంత్రి మరియు IVF సెంట్రల్ కమిటీ అడ్వైజర్ కపిల్ దేవ్ అగర్వాల్ రావడం జరిగింది.
ఈ సందర్బంగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఘన స్వాగతం పలకడం జరిగింది.
ఈ సందర్భంగా వారు దేశ వ్యాప్తంగా వున్న ఆర్య వైశ్యుల అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యాచరణ మీద చర్చించడం జరిగింది.
కపిల్ దేవ్ అగర్వాల్ గారు మాట్లాడుతూ
ఆర్య వైశ్యులు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తమ హక్కుల కోసం పోరాడాలని ఆయన అన్నారు.
రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆయన చెప్పారు.
ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటాను అని త్వరలోనే లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్య వైశ్యులు అందరూ పోటీ చేసి తమ సత్తా చాటాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment