దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం – ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ


 దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం – ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ

జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఎబివిపి సెమినార్

మిర్యాలగూడ, జూలై 9: జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) మిర్యాలగూడ నగర శాఖ ఆధ్వర్యంలో ఆరోరా, సినాప్సు జూనియర్ కళాశాలల్లో సెమినార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశిష్ట పాత్ర పోషించిందని అన్నారు. ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఎబివిపి నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు విస్తరించి 78 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని తెలిపారు.

ఎబివిపి నినాదాలు నేడు దేశ విధానాలుగా మారాయని పేర్కొన్న ఆయన, కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనల రద్దు కోసం, అక్రమ వలసల నిరోధం కోసం, జాతీయ భద్రత అంశాలపై ఎబివిపి చేపట్టిన ఉద్యమాలు దేశ ప్రయోజనాలకు దోహదపడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహా పాదయాత్ర, రణభేరి, హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

జాతీయవాద భావజాలంతో కూడిన వ్యక్తి నిర్మాణమే ఎబివిపి లక్ష్యమని, భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వంశీ, సాయి, వరుణ్, ధనుష్, నాగరాజు, అజయ్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ