అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం


 అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం 

* 22న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హ‌ణ‌

 * ప్ర‌పంచ రికార్డు సృష్టించ‌నున్న ఘ‌ట్టం * స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌స్తున్న ఆర్య‌వైశ్యులు 

* విజ‌య‌వంతం చేయాల‌ని కల్వ సుజాత గుప్త పిలుపు 







హైద‌రాబాద్‌:  హైద‌రాబాద్‌ ఎల్ బీ స్టేడియం మ‌రో అద్భుత చారిత్ర‌క ఘ‌ట్టానికి వేదిక కాబోతోంది.  ఈ నెల 22న ఆదివారం ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్టు సౌజ‌న్యంతో తెలంగాణ ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.  దాదాపు 30 వేల మంది వైశ్యులు ప్ర‌ముఖ క‌వి చింత‌ల శ్రీ‌నివాస్ రచించిన 102 చ‌ర‌ణాల‌తో కూడిన వాస‌వీ పారాయ‌ణాన్ని సామూహికంగా ఆల‌పించ‌నున్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన ఇన్ని వేల మంది ఒకే స్వ‌రంతో పారాయ‌ణం చేయ‌డం ప్ర‌పంచ‌రికార్డు కానుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.  ఈ ఘ‌న‌త‌ను రికార్డు చేయ‌డానికి గిన్నీస్ ప్ర‌తినిధులు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.  ఆధ్యాత్మిక , సేవా కార్యక్ర‌మాల్లో ముందుండే ఆర్య‌వైశ్యులంద‌రినీ ఒక్క‌తాటిపైకి తేవ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశ‌మ‌ని  ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ క‌ల్వ సుజాత గుప్త వెల్ల‌డించారు. పెద్ద సంఖ్య‌లో పాల్గొని దీనిని విజ‌య‌వంతం చేయాల‌ని ఆమె కోరారు. 

ఈ ధార్మిక‌, సామాజిక కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుమ‌ల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొంటున్నారు. ఏఐసీసీ సెక్రెట‌రీ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, మాజీ ఎంపీ టీ జీ వెంక‌టేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గౌర‌వ అతిథులుగా పాల్గొంటున్నారు.   అధికారులు జ‌యేశ్ రంజ‌న్‌, సి.హెచ్.ప్రియాంక‌, వేముల శ్రీ‌నివాస్‌, ఆర్ వీ క‌ర్ణ‌న్ లు ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు.  16 మంది పీఠాధిప‌తులు ఈ కార్య‌క్ర‌మంలో  భ‌క్తులనుద్దేశించి మాట్లాడ‌నున్నారు. అనేక సంఘాల భాగ‌స్వామ్యం  రాష్ట్ర ఆర్య‌వైశ్య మ‌హాస‌భ‌, వాస‌వీ క్ల‌బ్స్ ఇంట‌ర్నేష‌నల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ (ఐవీఎఫ్‌),  ఫెడ‌రేష‌న్ ఆవోపాస్ ఆఫ్ ఇండియా, ప్ర‌పంచ ఆర్య‌వైశ్య మ‌హాస‌భ లాంటి అనేక వైశ్య సంఘాలు, సేవా సంస్థ‌లు, శ్రీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి దేవాల‌య క‌మిటీలు  శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వంలో పాలుపంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల నుంచి ఆర్య‌వైశ్యులు పెద్ద ఎత్తున ఈ మ‌హోత్స‌వానికి  స్వ‌చ్ఛందంగా వ‌స్తున్నార‌ని ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్టు గౌరవాధ్య‌క్షులు బెల్ది శ్రీ‌ధ‌ర్ తెలిపారు. ఈ మ‌హోత్స‌వానికి అంద‌రికీ ఉచిత ప్ర‌వేశం క‌ల్పిస్తున్నామ‌న్నారు. అయితే హాజ‌రు కాద‌ల‌చిన వారు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు.  ఇప్ప‌టికే వేలాది మంది  రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని వెల్ల‌డించారు.  వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశామ‌ని వారు తెలిపారు.  గాయ‌ని క‌ల్ప‌న ప్ర‌త్య‌క్షంగా వాస‌వీ పారాయ‌ణాన్ని ఆల‌పించ‌నున్నార‌ని రంజని సిస్ట‌ర్స్‌ భ‌జ‌న్ జామింగ్ తో పాటు ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఈ వేదిక‌పై ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌న్నారు.  

పాల్గొన దలచిన వారు ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ కావచ్చు.

https://forms.gle/EGaTPBz9YJeFPYiRA

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ