మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.


 

మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.                


ఘనంగా ఐవిఎఫ్ మహిళా దినోత్సవం.                         


ప్రజా ప్రతినిధులకు సన్మానం 


నల్లగొండ మార్చి 21, గూఢచారి :                 

మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలని పురుషులతో సమానంగా ఎదగాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన ఐవీఎఫ్ మహిళా దినోత్సవం ప్రజాప్రతినిధులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపార పరంగా ఎదగాలన్నారు. మహిళలకు ఓర్పు సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మహిళలను గౌరవించడం వారిని సన్మానించడం మంచి సంప్రదాయమన్నారు. మహిళలు లేని సమాజం లేదని మహిళలు గౌరవించినచోట శుభాలు కలుగుతాయి అన్నారు. ఐ వి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీను మాట్లాడుతూ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని ఎంబిబిఎస్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే ఆర్యవైశ్య పేద విద్యార్థులకు లక్ష రూపాయలు చొప్పున సాయం అందించామని చెప్పారు. ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను నూతన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను సన్మానించి వారిని గౌరవించడం ఐ వి ఎఫ్ సంప్రదాయమన్నారు. సభ్యత్వ సేకరణ ముమ్మరంగా సాగుతుందని ఐ వి ఎఫ్ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది ఆర్యవైశ్యులు ఉన్నారని అందులో నాలుగు కోట్ల మందికి ఐవీఎఫ్ సభ్యత్వం ఇవ్వనున్నామన్నారు ఆర్యవైశ్య పేద ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం  నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమ చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, నల్లగొండ 48 వ వార్డు డివిజన్ కార్పొరేటర్ యామ కవిత దయాకర్ ఐ వి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాసు, సౌత్ సెంట్రల్ ఇన్చార్జి ఉప్పల స్వప్న చందా భాగ్య లక్ష్మి ఐవీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ లెంకలపల్లి మంజుల కోశాధికారి నలిని ఐ వి ఎఫ్ నాయకులు తాళ్లపల్లి రాము, పారేపల్లి శ్రీనివాస్, నాల వెంకటేశ్వర్లు బుక్కా వెంకయ్య, మేడం విశ్వప్రసాద్ వందనపు జ్యోతి, వీరెల్లి సతీష్ కోటగిరి రామకృష్ణ కర్నాటి నగేష్ డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ