*నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి - వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *ఘటనపై HRC కి ఫిర్యాదు చేసిన జిల్లా వాసి నవీన్ కుమార్ మల్లేపల్లి*
*నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి - వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ*
*ఘటనపై HRC కి ఫిర్యాదు చేసిన జిల్లా వాసి నవీన్ కుమార్ మల్లేపల్లి*
*నల్లగొండ:* జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
*అసలేం జరిగింది?*
కంబంపాటి కవిత అనే మహిళ రెండవ కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు అనంతరం శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
*HRC కి ఫిర్యాదు*
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త *నవీన్ కుమార్ మల్లేపల్లి* రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
_- గుడాచారి.పేజ్_

Comments
Post a Comment