ముగిసిన ఫిలిం ఛాంబర్‌ తంతు.. ' మన ప్యానెల్‌ ' ఘన విజయం.


ముగిసిన ఫిలిం ఛాంబర్‌ తంతు.. ' మన ప్యానెల్‌ ' ఘన విజయం.


          హైదరాబాద్‌ : ఉద్రిక్తతల నడుమ సాగిన ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానెల్‌' వర్గం ఘన విజయం సాధించింది. 'మన ప్యానెల్‌' తరఫున ఎన్నికల్లో 9 మంది విజయం సాధించగా, ప్రత్యర్థి వర్గం 'యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ ' ప్యానెల్‌ లో కేవలం దిల్‌ రాజు, దామోదర్‌ ప్రసాద్‌ మాత్రమే గెలిచారు. ఇండిపెండెంట్‌ గా బరిలో దిగిన మోహన్‌ గౌడ్‌ కూడా నెగ్గాడు. 20 మంది సెక్టార్‌ మెంబర్స్‌ లో 'మన ప్యానెల్‌' నుంచి 16 మంది గెలుపొందారు. 'మన ప్యానెల్‌' నుంచి వైవీఎస్‌ చౌదరి, నట్టి కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, ఎం.శివకుమార్‌, కేశవరావు, సాగర్‌ తదితరులు పోటీ చేయగా, 'యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌' ప్యానెల్‌ తరఫున దిల్‌ రాజు, డీవీవీ దానయ్య, కొర్రపాటి సాయి, రవిశంకర్‌, దామోదర్‌ ప్రసాద్‌, ఆచంట గోపీనాథ్‌, కేకే రాధామోహన్‌, శివలెంక కృష్ణప్రసాద్‌, భోగవల్లి ప్రసాద్‌ తదితరులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తయింది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*