Skip to main content

కెనడా లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు - ఘనంగా ధూమ్ ధామ్ వేడుకలు




 

కెనడా లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా ధూమ్ ధామ్ వేడుకలు

ముఖ్యఅతిథిగా కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా శుభన్ క్రిషన్

తెలంగాణ కెనడా అసోసియేషన్ (టిసిఎ) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ధూమ్ ధామ్ 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా శుభన్ క్రిషన్ (కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా), పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా (టిసిఎ) నిర్వహిస్తున్న కార్యక్రమాలని హర్షించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు (టిసిఎ) ను అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరింపజేసారు.

ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణ వాసులు (ఎన్నారై) లు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, శ్రీమతి లావణ్య ఏళ్ల, శ్రీమతి అనూష ఇమ్మడి, శ్రీమతి స్వాతి అర్గుల, శ్రీమతి రాధిక దలువాయి, శ్రీమతి రజిని తోట జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా వేదిక పై ఆసీనులైనారు.


ఆరంభ ప్రసంగం తో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం మునుపెన్నడు లేనట్టుగా చిన్నారులకు టాలెంట్ షో ని నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్ మరియు మెంటల్ మ్యాథ్స్ లాంటి విభాగాలలో వారి టాలెంట్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఉమా సలాడి, శ్రీమతి లక్ష్మీ సంధ్యా, భరత్ మరియు శ్రీమతి మనస్విని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దీనికి వ్యాఖ్యాతలుగా శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి మరియు శ్రీమతి మాధురి చాతరాజు వ్యవహరించారు. ఈ షోలో గెలిచిన చిన్నారులకి శ్రీ విష్ణు బోడ (రియల్టర్) బహుమతులను అందజేశారు. చిన్నారులని వారి వయసును బట్టి రెండు గ్రూపులుగా విభజించారు. అనికా శ్యామల(10), సాయి స్నిగ్ధ తంగిరాల(8) మొదటి స్థానము ఆకాంక్ష(11), శివాన్ష్ దవల(7) రెండవ స్థానము మరియు జడ్జెస్ స్పెషల్ చాయిస్ గా ఆర్యన్ పొనుగంటి(11) శ్రీతన్ పూల(10) మాన్య నాగబండి(9), శ్రీరామదాసు అరుగుల(7), విద్వాన్ష్ రాచకొండ(5) గెలిచారు. ఈ కార్యక్రమం మొత్తం నాలుగు గంటల పాటు ఉమెన్స్ కమిటీ సభ్యులు శ్రీమతి రాధికా బెజ్జంకి మరియు శ్రీమతి మాధురి చాతరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. సాంస్కృతిక కార్యక్రమలను కుమారి ప్రహళిక మ్యాకల, శ్రీ రాహుల్ బాలనేని, కుమారి ధాత్రి అంబటి మరియు శ్రీమతి స్ఫూర్తి కొప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఈ వేడుక స్పాన్సర్ బెస్ట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ట్యూటరింగ్ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రారంభించారు. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ TCA ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. TCA ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ తో కలర్ ఫుల్ గా ఆర్గనైజ్ చెయ్యడం పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా 16 విభిన్నమైన వెండర్ స్టాల్స్ ని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా TCA తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది. 


ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల మరియు యూత్ డైరెక్టర్ కుమారి ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మురళి సిరినేని, మురళీధర్ కందివనం మరియు శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల, శ్రీనివాస తిరునగరి, హరి రావుల్, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రభాకర్ కంబాలపల్లి, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కెనడా తెలంగాణ అసోసియేషన్(TCA) విందు ఏర్పాట్లు ఘనంగా జరిగింది. 

చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం గారి కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ ధూంధాం 2023 వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిసినది.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్