కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్


 *కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్*



బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు.



తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను మోడీ ఈ సందర్భంగా అభినందించారు.


రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*