Skip to main content

PDS బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణా చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్ - జిల్లా యస్.పి చందనా దీప్తి IPS


 *నకిరేకల్,తిప్పర్తి పోలీస్ స్టేషన్ ల పరిధిలో 35 క్వింటాళ్ల PDS బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణా చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్* 

నల్గొండ: 

 *జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్న జిల్లా పోలీస్* ..


 *--- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి చందనా దీప్తి IPS* 


  ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ గారు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.


   ఈ రోజు జిల్లా యస్.పి గారి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం నకేరేకల్ మరియు తిప్పర్థి పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సమన్వయంతో తాటికల్ గ్రామంలో గల సురారపు పిచ్చయ్య తండ్రి లచ్చయ్య ఇంట్లో అక్రమ నిల్వ ఉంచిన 22 బస్తాలలొ 10 కింటాల్ పిడిఎస్ బియ్యం మరియు తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడాల స్టేజ్ వద్ద నుండి బోలోరో వెహికిల్ ద్వార అక్రమ రవాణా చేస్తున్న మొగిలి ఉపేందర్ తండ్రి మైసయ్య,మొగిలి నాగరాజు తండ్రి చద్రయ్య,సాయి కుమార్ తండ్రి వెంకన్న ల నుండి 50 బస్తలలో 25 కింటాల్ల పీడీఎస్ బియ్యం బొలోరో వెహికిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది తెలిపారు. ఈ సందర్భంగా యస్.పి గారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలైన గంజా,జూదం బెట్టింగ్,అక్రమ పీడీఎస్ రైస్ రవాణా, లాంటి వాటిని అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ లాంటి నేరాలు అలవాటుగా చేస్తున్న వారి పై PD ఆక్ట్ చట్టం నమోదు చేస్తామని అన్నారు.అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడం కోసం నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తమని అన్నారు.


 *పట్టుబడిన నిందితుల వివరాలు* 

.

1.సురారపు పిచ్చయ్య తండ్రి లచ్చయ్య గ్రామం తాటికల్ మండలం నకిరేకల్ జిల్లా నల్లగొండ.

2.మొగిలి ఉపేందర్ తండ్రి మైసయ్య,గ్రామం తాటికల్ మండలం నకిరేకల్, జిల్లా నల్లగొండ.

3.మొగిలి నాగరాజు తండ్రి చద్రయ్య,గ్రామం తాటికల్, మండలం నకిరేకల్, జిల్లా నల్లగొండ.

4.సాయి కుమార్ తండ్రి వెంకన్న,గ్రామం తాటికల్,మండలం నకిరేకల్, జిల్లా నల్లగొండ.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్