గతంలో ధాన్యం లూటీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న మిల్లులవద్దే ప్రభుత్వ ధాన్యం?

 



గతంలో ధాన్యం లూటీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న మిల్లులవద్దే ప్రభుత్వ ధాన్యం?

నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారుతున్న ప్రభుత్వ ధాన్యం నిల్వల వ్యవహారం

నల్లగొండ జిల్లాలో గతంలో ప్రభుత్వ ధాన్యం లూటీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని, కేసులు నమోదై జైలు పాలైన కొందరు రైస్ మిల్లుల వద్దకే ప్రస్తుతం ప్రభుత్వ ధాన్యాన్ని నిల్వ ఉంచుతున్నారనే సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

రైతుల నుండి కొనుగోలు చేసిన వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని ఇలాంటి మిల్లులకు కేటాయించడం వెనుక ఉన్న కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అక్రమ నిల్వలు, బియ్యం అక్రమ రవాణా, స్టాక్ మాయంపై ఆరోపణలు ఎదుర్కొన్న మిల్స్ కి మళ్లీ వద్ద ధాన్యం నిల్వలు ఉంచడం అధికారుల నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఇప్పటికే పలువురు మిల్లర్లపై కేసులు నమోదై, కొందరు జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అలాంటి మిల్లుల వద్దే ప్రభుత్వ ధాన్యం నిల్వ చేయడం వెనుక ఎవరెవరి ఆశీస్సులు ఉన్నాయన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయం పై నల్గొండ dso ను వివరణ కొరకు ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అనుమతి తో ధాన్యం నిల్వ ఉంచుతున్నామని తెలిపారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*