PCB అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు: TGPSC కీలక నిర్ణయం!
PCB అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు: TGPSC కీలక నిర్ణయం!
హైదరాబాద్ (గూఢచారి వెబ్ డెస్క్): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక తీపి కబురు అందించింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) లో భర్తీ చేయనున్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ -II) పోస్టులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
నోటిఫికేషన్ నంబర్ 01/OG/PC/2026 (తేదీ: 20/04/2026) ద్వారా విడుదలైన ఈ పోస్టులకు గతంలో ఉన్న వయోపరిమితిని సవరిస్తూ ఇవాళ (మే 20, 2026) ఒక అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
34 నుంచి 44 ఏళ్లకు పెంపు
సాధారణ పరిపాలన శాఖ (GAD) మే 18, 2026న జారీ చేసిన G.O.Ms.No.86 ఉత్తర్వుల ప్రకారం... ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి ప్రత్యేక లేదా అడహాక్ నిబంధనల కింద గరిష్ట వయోపరిమితిని మరో 10 సంవత్సరాలు పెంచారు. దీనితో ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ TGPSC నిర్ణయం తీసుకుంది. G.O.Ms.No.86 ప్రకారం వర్తించే అన్ని వయోసడలింపులతో కలిపి ఈ గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ధారించారు.
అభ్యర్థులకు మంచి అవకాశం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వయస్సు పైబడి అవకాశాలు కోల్పోతామన్న ఆందోళనలో ఉన్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ వయోపరిమితి మార్పును గమనించాలని TGPSC అడిషనల్ సెక్రటరీ తమ ప్రకటనలో కోరారు.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తాజా అప్‌డేట్ల కోసం చూస్తూనే ఉండండి — gudachari.page

Comments
Post a Comment