ఉప్పల దంపతుల ఆతిథ్యం: డా. ఆరతి కృష్ణకు ఘన సన్మానం

 



ఉప్పల దంపతుల ఆతిథ్యం: డా. ఆరతి కృష్ణకు ఘన సన్మానం

హైదరాబాద్ (గూఢచారి ప్రతినిధి):

ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణకు హైదరాబాద్‌లో ఘన సన్మానం జరిగింది. శుక్రవారం నాడు ఆమె ఏఐసీసీ కార్యదర్శి, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (IVF) జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త - స్వప్న దంపతులు ఆమెకు సాదరంగా సుస్వాగతం పలికారు. అనంతరం డా. ఆరతి కృష్ణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు.

ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానానికి..

సన్మాన కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సమాజానికి డా. ఆరతి కృష్ణ అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఆమె ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తనపై చూపిన ఆప్యాయతకు, అందించిన అద్భుత ఆతిథ్యానికి డా. ఆరతి కృష్ణ ఉప్పల కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*