సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం!

 


సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం!

హైదరాబాద్ (గూఢచారి ): తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మేర కులస్తుల ఆకాంక్షను నెరవేరుస్తూ, ప్రత్యేకంగా 'మేర కార్పొరేషన్' ఏర్పాటు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి కి కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

బుధవారం తెలంగాణ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని మేర కులస్తుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు సమర్పించారు.

తక్షణమే రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయింపు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేర కులస్తులను గుర్తించి, కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా.. దానికి చైర్మన్, వైస్ చైర్మన్‌లను నియమించడంపై సంఘ వెంకట రాజ్యం హర్షం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, కార్పొరేషన్ బలోపేతానికి మరియు కులస్థుల సంక్షేమానికి వెనువెంటనే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

కష్టపడి పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఈ భేటీ సందర్భంగా నూతనంగా నియమింపబడ్డ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..

"మీ సమాజానికి, మీ జాతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మీపైనే ఉంది. ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లు బాధ్యతాయుతంగా, కష్టపడి పని చేయాలి." అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, కార్పొరేషన్ ప్రతినిధులు మరియు మేర సంఘం నాయకులు పాల్గొన్నారు.

[ Gudachari.page Digital Desk ]

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్