జర్నలిస్టులకు 10క్వింటాళ్ల బియ్యం అందజేసిన జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్
జర్నలిస్టులకు 10క్వింటాళ్ల బియ్యం అందజేసిన జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్
కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు చేయూతనివ్వాలని ఉద్దేశ్యంతో స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరులో... 40 మంది జర్నలిస్టులకు T జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ తన స్వంత ఖర్చుతో ఒక్కొక్కరికి 25కిలోల చొప్పున 10 క్వింటాళ్ల బియ్యం, మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కరోన వైరస్ నేపధ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులు ఎప్పటికప్పుడు టీవీ దినపత్రిక ద్వారా ప్రజలకు ఆచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలను అభినందించారు... జర్నలిస్టులు దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు... ఈ విపత్కర సమయంలో జర్నలిస్టులకు తగిన చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని పల్లె రవికుమార్ అన్నారు
Comments
Post a Comment