రేపు హైదరాబాద్‌లో తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్తాపత్రికల ప్రదర్శన – 2026


 రేపు హైదరాబాద్‌లో  తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్తాపత్రికల ప్రదర్శన – 2026


చిన్న, మధ్యతరహా పత్రికల ప్రాధాన్యతను చాటనున్న ప్రదర్శన.. ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి


హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28న (శనివారం) హైదరాబాద్‌లో వార్తాపత్రికల ప్రదర్శన–2026 నిర్వహించనున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.


ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు అధ్యక్షత వహించనున్నారు.


ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్, తెలంగాణ శాసన మండలి విప్ అద్దంకి దయాకర్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్ పాల్గొననున్నారు.


ప్రత్యేక అతిథులుగా ఐజేయూ స్ట్రీమింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయూ ఉపాధ్యక్షుడు వై. నరేంద్ర రెడ్డి, ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్షుడు ఎం.ఎ. మజీద్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. రమేష్ తదితరులు పాల్గొననున్నారు.


చిన్న, మధ్యతరహా వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు పత్రికా రంగానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు.


కార్యక్రమానికి జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాల ప్రతినిధులు, మీడియా రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై. లింగయ్య, కోశాధికారి అజం ఖాన్ కోరారు.

Comments

Popular posts from this blog

# వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్‌లో మాజీ అధ్యక్షుడి కి షాక్? ## అవినీతి ఆరోపణలపై క్రిమినల్ చర్యలకు ప్రస్తుత బాడీ సిద్ధం?

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు