*సీఎం రేవంత్ రెడ్డికి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*


 *సీఎం రేవంత్ రెడ్డికి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*


*హైదరాబాద్, నవంబరు 23:* తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ భేటీలో తన చిన్న కుమారుడు ఉప్పల సాయి తేజ వివాహ మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి నూతన దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ, తమ కుటుంబంలో జరగనున్న ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 


ఉప్పల శ్రీనివాస్ గుప్త కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకుడిగా, వైశ్య సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వైశ్యులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు, విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.


వివాహ వేడుకకు రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు