*BREAKING: ఫార్ములా భారత్ - 2027 కోసం CBIT విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.6 లక్షల ప్రోత్సాహకం*
*BREAKING: ఫార్ములా భారత్ - 2027 కోసం CBIT విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.6 లక్షల ప్రోత్సాహకం*
*హైదరాబాద్:* ఫార్ములా భారత్ - 2027 పోటీలకు సిద్ధమవుతున్న CBIT విద్యార్థుల రేసింగ్ టీమ్‌కు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
*కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్* ద్వారా *'ప్రహెతి రేసింగ్ - SAE CBIT'* టీమ్‌కు ప్లాటినమ్ స్పాన్సర్‌గా నిలిచిన మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
CBIT పూర్వ విద్యార్థిగా, తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో సాంకేతిక ప్రతిభను చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలవడం తమకు ఎంతో ప్రత్యేకమని విద్యార్థులు తెలిపారు. ఆయన అందించిన ఆర్థిక సహాయం తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి, ఫార్ములా భారత్ - 2027 పోటీల్లో సమర్థవంతంగా పాల్గొనేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తూ, రేసింగ్ కారును రూపొందించడం, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ ప్రయాణంలో మంత్రి అందించిన ప్రోత్సాహం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని, ఆయన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రహెతి రేసింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా *అరవింద్*, వైస్ కెప్టెన్‌గా *స్మిత్ బోర్సే* వ్యవహరిస్తుండగా, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌గా *డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని* మార్గనిర్దేశం చేస్తున్నారు.
విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, యువత చదువుతో పాటు పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, ప్రాక్టికల్ అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపమిచ్చి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫార్ములా భారత్ - 2027 పోటీల్లో ప్రహెతి రేసింగ్ టీమ్ విజయవంతంగా పాల్గొని CBIT కళాశాలకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

Comments
Post a Comment