ఘనంగా యెర్రం విజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు
ఘనంగా యెర్రం విజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు హైద్రాబాద్, 17డిసెంబర్ గూఢచారి: మంగళవారం వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ ఎర్రం విజయ్ కుమార్ గారి 61వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కౌటికె విఠల్ వెయ్యి మంది అన్నార్తులకు భోజన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, "నా విలువైన పాలసీదారులు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం ఉంది" అని తెలిపారు.* *ఈ ప్రత్యేక సేవా కార్యక్రమానికి తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్, శ్రీమతి కలువ సుజాత ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.* *శ్రీమతి కలువ సుజాత మాట్లాడుతూ, "తన పాలసీదారులపట్ల కౌటికె విఠల్ గారు చూపించే నిబద్ధత, సేవా తత్పరత ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రతి విలువైన పాలసీదారుడి జన్మదినానికి 1000 మందికి భోజనం అందించడం ఆయన దానగుణానికి నిదర్శనం" అని కొనియాడారు. ఎర్రం విజయ్ కుమార్ తన నిస్వార్థ సేవలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విఠల్ ఈ సేవా కార్యక్రమాన్ని వ...