విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు



విశాఖలో భారీ ప్రమాదం


కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు


రోడ్డుపైనే పడిపోతున్న జనం


ఎల్జీ పాలిమర్స్‌లో ఘటన


ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక



భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు


 


విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. 200 మంది అస్వస్థతకు గురైనారని తెలిసింది.అసవస్థతకు గురైన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*