జర్నలిజానికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండగా ఉంటాం-పొంగులేటి
*జర్నలిజానికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండగా ఉంటాం* *అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం వాస్తవం కాదు* *గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్ల మంజూరు* *ఏకార్డుకైనా అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి* *జర్నలిస్టు సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం* *జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం* *జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం* *14 జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించిన* ... *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *హైదరాబాద్*:- జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ ఒక్కరి గౌరవాన్ని తగ్గించాలని గాని, చిన్నబుచ్చాలనిగాని తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. జీవో 252 ప...