Posts

నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

Image
నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ నల్గొండ:  బీజేపీ రాజ్యసభ సభ్యుడు *డాక్టర్ కే లక్ష్మణ్* నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయింట్స్... రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు... గతంలో టీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు... కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు... పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని అన్నారు... నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు...

వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై సమావేశం

Image
  వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై సమావేశం హైద్రాబాద్: "వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై జనవరి 29, 2026న MCHRDITలో ఒక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. "ఆరోగ్యకరమైన తెలంగాణ కోసం పరిశుభ్రమైన గాలి" అనేది ప్రభుత్వ నినాదమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. స్థిరమైన అభివృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం లక్ష్యం. మెరుగైన రేపటి కోసం పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం నీటి వనరుల పునరుద్ధరణ మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ చర్యలు తీసుకుంది. గాలి నాణ్యత పౌరుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది మరియు తద్వారా ఉత్పాదకత రాష్ట్ర GDP పై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024 వంటి అనేక నివేదికలు సూచిస్తున్నాయి అధిక రక్తపోటు తర్వాత మరణానికి వాయు కాలుష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన ప్రమాద కారకంగా ఉంది. 2021-2023 నాటికి ఏటా దాదాపు 8.1 మిలియన్ల అకాల మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో...

నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ

Image
 నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ. నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 45 వ డివిజన్ నుండి BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గడాలె విజయ ను ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా గడాలె విజయ మాట్లాడుతూ  45 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేయుచున్నానని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాననీ, ఈ ప్రయాణంలో డివిజన్ అందరి సహాయ సహకారం, మద్దతు నాకు ఎల్లప్పుడూ అవసరం అని, మీ నమ్మకానికి తగ్గట్టుగా, నిరంతరం మన డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ అవకాశాన్ని అందించిన మా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని  న్యాయవాది  పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు గూఢచారి, హైదరాబాద్, 29 జనవరి:  తెలంగాణ ఆర్యవైశ్య  మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు,   24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను  నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ  తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్‌కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.

ఫ్లాష్.. ఫ్లాష్.. BRS రెండవ జాబితా విడుదల

Image
 నల్గొండ  మున్సిపల్ కార్పొరేషన్ BRS అభ్యర్థుల రెండవ జాబితా విడుదల

ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు

Image
 ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు హైదరాబాద్:  సెల్ వెల్ సంస్థ సీఎండీ విద్యా దాత సుబ్బా రావు సార్ చంద్రిక M. ఫార్మసి చదువు కాలేజ్ ఫీజు నిమిత్తం 35000 చెక్ అందచేశారు. ఈ సందర్భంగా మొగుళ్ళపెల్లి ఉపేందర్ సుబ్బారావు కు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.

పంచముఖ హనుమాన్ దేవాలయంలో 18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..

Image
 నల్గొండ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ..! నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో భక్తుల జయజయధ్వానాల నడుమ *18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..! వేద మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి... భారీగా తరలివచ్చిన భక్తజనం... జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిన కాలనీ పరిసరాలు..! ప్రాంత ప్రజలతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు... భక్తి.. శక్తి.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం వెంకటేశ్వర కాలనీ పంచముఖ హనుమాన్ ఆలయం...